Friday 5 April 2019

మేష రాశి ఫలితములు 2019-2020 వికారి నామ సంవత్సర రాశిఫలములు

Mesha Rashiphal (Rashifal) for Vijaya telugu year
అశ్వని 1, 2, 3, 4, పాదములు (చూ, చే, చో, లా) 
భరణి 1, 2, 3, 4 పాదములు (లీ, లూ, లే, లో)
కృత్తిక 1వ పాదము (ఆ)
ఈ వికారి నామ సంవత్సరంలో మేష రాశి వారికి గురువు, ఏప్రిల్ 23 నుంచి నవంబర్ 5 వరకు ఎనిమిదవ ఇంటిలో, వృశ్చిక రాశిలో సంచరిస్తాడు. నవంబర్ 5 నుంచి ధనూరాశిలో, తొమ్మిదవ ఇంట సంచరిస్తాడు. శని జనవరి 24వ తేదీ వరకు 9వ ఇంట, ధనూరాశిలో ఆ తర్వాత పదవ ఇంటిలో మకర రాశిలో సంచరిస్తాడు. రాహువు సంవత్సరం అంతా మిథున రాశి లో మూడవ ఇంట కేతువు తొమ్మిదవ ఇంటిలో ధనురాశిలో సంచరిస్తారు.

ఉద్యోగం


ఈ వికారి నామ సంవత్సరంలో మేషరాశి వారికి ప్రథమార్థం కొంత సామాన్యంగా ఉన్న ద్వితీయార్థం మాత్రం బాగా కలిసి వస్తుంది. గురు చంద్రుల గోచారం ప్రథమార్థంలో కొంత సామాన్యంగా ఉండటం వలన వృత్తిలో ఒత్తిడి ఎక్కువగా ఉండటం అలాగే అనుకోని మార్పులు చోటు చేసుకోవడం జరుగుతుంది. ఏప్రిల్ నుంచి నవంబర్ లో మధ్యలో గురువు అష్టమ స్థానంలో సంచరించడం వలన ఉద్యోగంలో అనుకోని చికాకులు ఏర్పడటం, కావలసిన పనులన్నీ చివరిక్షణంలో వాయిదా పడటం అలాగే పై అధికారులతో సరైన అవగాహన ఉండకపోవడం వలన ఈ విషయంలో అనుకున్న ఫలితం రాకపోతే అవకాశం ఉంటుంది. అయితే నవంబర్ లో గురువు తొమ్మిదవ ఇంటికి రావడం అలాగే జనవరిలో శని పదవ ఇంటికి రావడం వలన వృత్తిలో అనుకూలమైన మార్పులు చోటుచేసుకుంటాయి. పేరు ప్రమోషన్ కొరకు కానీ లేదా వృత్తిలో మార్పు కొరకు ఎదురు చూస్తూన్నట్లయితే అది ద్వితీయార్థంలో అనుకూలంగా ఉంటుంది. ఈ సంవత్సరం రాహు మూడవ ఇంటిలో సంచరించడం వలన ఎన్ని రకాల అడ్డంకులు ఏర్పడినప్పటికీ మీలో ఉత్సాహం సన్నగిల్లకుండా పనులు పూర్తిచేసుకోగలుగుతారు. విదేశీయానానికి సంబంధించి ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే విదేశాల్లో ఉండే ఉద్యోగస్థులకు ద్వితీయార్ధంలో వీసా సమస్యలు తీరుతాయి. వ్యాపారస్తులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. ప్రథమార్థంలో ఖర్చుకు తగిన ఫలితం ఉండకపోవటం అలాగే పనులు వాయిదా పడటం వలన ఆర్థికంగా అనుకున్నంత రాబడి ఉండకపోవచ్చు. నూతన వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారు నవంబర్ వరకు ఆగి నవంబర్లో గురు మారక వ్యాపారాలు ప్రారంభించడం మంచిది. అలాగే వ్యాపార పెట్టుబడులు కూడా నవంబర్ వరకు సమయం అనుకూలంగా ఉండదు. నవంబర్ నుంచి అనుకూలంగా మారడం వలన మీ వ్యాపారంలో అనుకోని అభివృద్ధి చోటు చేసుకుంది అలాగే ఆర్థిక సమస్యలు కూడా తీరుతాయి. మీ వ్యాపారం అభివృద్ధి చెందడమే కాకుండా నూతన వ్యాపారాలు ప్రారంభించటానికి మంచి అవకాశాలు కూడా లభిస్తాయి. రాహు అనుకూల గోచారం కారణంగా ఏ సంవత్సరంలో మీ వ్యాపారం మంచి ప్రచారాన్ని పొంది అభివృద్ధి లోకి వస్తుంది. అలాగే స్వయం ఉపాధి రంగంలో ఉండే వారికి కూడా ఈ సంవత్సరం బాగా కలిసి వస్తుంది. మీరు చేసే ప్రయత్నాలు ఫలించి మీకు మీ వృత్తి పరంగా ఒక స్థిరత్వాన్ని విజయాన్ని ఈ సంవత్సరం అందుకుంటారు.

ఆర్థిక స్థితి

మీకు ఈ సంవత్సరం ఆర్ధికంగా ప్రథమార్థం కంటే ద్వితీయార్థం చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ సంవత్సరం నవంబర్ వరకు గురు గోచారం అనుకూలంగా లేకపోవడం వలన ఆర్థికంగా కొంత ఒడిదుడుకులకు లోను కావలసి వస్తుంది. అనుకున్నదాని కంటే ఖర్చులు ఎక్కువ అవటం రాబడి పరంగా అంత అనుకూలంగా ఉండక పోవడం వలన మీ ఆర్ధిక స్థితి విషయంలో కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది అనవసరమైన ఖర్చులను తగ్గించి పొదుపు పెంచడం వలన ఆర్థిక సమస్యల నుంచి దూరం అవడానికి ఆస్కారం ఉంటుంది. సంవత్సర ద్వితీయార్ధంలో నవంబర్ తర్వాత గురువారం అనుకూలంగా మారడం వలన ఆర్థిక స్థితి మెరుగు పడుతుంది ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేస్తారు అలాగే మీ ఆదాయం కూడా పెరుగుతుంది

కుటుంబం

ఈ సంవత్సరం కుటుంబ జీవితం అనుకూలంగా ఉంటుంది గురు గోచారం మీ జీవిత భాగస్వామికి అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది దీని కారణంగా మీ జీవిత భాగస్వామి ఉద్యోగులకు ఆదాయంలో కానీ మంచి అభివృద్ధిని పొందుతారు. గురు దృష్టి కుటుంబ స్థానం మీద ఉండటం వలన కుటుంబ వృద్ధి జరుగుతుంది అలాగే మీ కుటుంబ సభ్యుల మధ్య ప్రేమాభిమానాలు పెంచుతుంది ద్వితీయార్థంలో మీకు అనుకూల ఫలితాన్ని ఇవ్వటమే కాకుండా మీ తండ్రి గారికి ఆరోగ్యాన్ని అలాగే కే బంధుమిత్రుల సహాయ సహకారాలను అందిస్తుంది తొమ్మిదవ ఇంట కేతు గోచారం కారణంగా ప్రథమార్థంలో మీ తండ్రిగారి ఆరోగ్య విషయంలో కొంత ఆందోళనకు లోనవుతుతారు. అయితే నవంబర్ తర్వాత గురు అనుకూలంగా రావడం వలన మీ తండ్రిగారి ఆరోగ్యం మెరుగు పడుతుంది అలాగే మీ ఇంట్లో ఆనందకరమైన వాతావరణం ఏర్పడుతుంది ఈ సంవత్సరం నవంబర్ లో గురువు తొమ్మిదింటికి మారటం కేతువుతో కలిసి ఉండటం వలన మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి ఇ ఆధ్యాత్మిక క్షేత్ర దర్శనం చేస్తారు అలాగే గొప్ప వారిని కలుసుకుంటారు వారి ఆశీర్వచనం తీసుకుంటారు .

ఆరోగ్యం


ఆరోగ్య విషయానికొస్తే ఈ సంవత్సరం గురు గోచారం నవంబర్ వరకు అనుకూలంగా ఉండదు కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది. లివర్ సమస్యలు డయాబెటిక్స్ అలాగే బరువు పెరగడం మొదలైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అయితే నవంబర్ నుంచి గురు అనుకూలంగా గోచరిస్తాడు కాబట్టి ఆరోగ్య సమస్యల నుంచి తొందరగా బయటపడగలుగుతారు. అలాగే ఈ సంవత్సరం అంతా అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఏ ఆరోగ్య సమస్యలు వచ్చినా అవి ఎక్కువ సమయం మిమ్మల్ని బాధించవు.

చదువు


ఇక విద్యార్థుల విషయానికి వస్తే ఈ సంవత్సరము అనుకూలంగా ఉంటుంది. గురువు దృష్టి విద్యా స్థానమైన నాలుగవ ఇంటిపై రెండవ ఇంటిపై ఉండటం వలన చదువు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు కానీ గురువు స్థానంలో ఉండటం వలన చదువు మీద ఆసక్తి తగ్గడం అలాగే ఏకాగ్రత తగ్గటం జరగవచ్చు కాబట్టి నిర్లక్ష్యం వహించకుండా చదువు మీద దృష్టి పెట్టడం మంచిది. రాహువు అనుకూలంగా ఉండటం వలన కొన్ని అడ్డంకులు ఎదుర్కొన్నప్పటికీ ఉత్సాహం తప్పక తగ్గకుండా పనులు పూర్తిచేసుకోగలుగుతారు అలాగే పోటీ తత్వం కూడా పెరుగుతుంది నవంబర్ నుంచి గురు భాగ్య స్థానంలో అనుకూలంగా సంచరించడం వలన పరీక్షల్లో మంచి విజయాలను సాధిస్తారు అలాగే విదేశాల్లో చదువుకోవడానికి ప్రయత్నిస్తున్నవారు అక్కడికి వెళ్లడానికి మంచి అవకాశాలు పొందుతారు. అయితే జనవరి వరకు శని గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి విదేశీ యానం విషయంలో కొంత జాగ్రత్త అవసరం.

పరిహారాలు


ఈ సంవత్సరం చేయాల్సిన పరిహారాలు విషయానికొస్తే ఈ సంవత్సరం ముఖ్యంగా గురువు గోచారం నవంబర్ వరకు అనుకూలంగా ఉండదు కాబట్టి ఇ గురువుకు పరిహారాలు చేసుకోవడం మంచిది ఈ గురు గోచారం కారణంగా ఖర్చులు పెరగడం ఆరోగ్య సమస్యలు రావడం తదితర ఫలితాలు ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతిరోజు గురు మంత్ర జపం చేయడం కానీ గురు స్తోత్ర పారాయణం చేయడం కానీ చేస్తే అనుకూల ఫలితాలను పొందుతారు. విద్యార్థులు చదువు విషయంలో కానీ లేదా ఉన్నత విద్య అవకాశాలు కానీ అడ్డంకులు ఎదుర్కుంటే శనికి మరియు కేతువుకు పూజ చేయించడం జపం చేయించండి లేదా ఆంజనేయ స్వామికి మరియు గణపతికి పూజ చేయడం కానీ చేయాలి ఇలా చేయటం వలన వారికి అడ్డంకులు తొలగిపోయి విజయం సాధిస్తారు

No comments:

Post a Comment