Friday 5 April 2019

కర్కాటక రాశిఫలములు వికారి నామ సంవత్సర రాశిఫలములు

కర్కTelugu Rashiphal, తెలుగు Telugu Rashiphal
పునర్వసు 4వ పాదము (హి) 
పుష్యమి 1, 2, 3, పాదములు (హు, హె, హో, డా) 
ఆశ్లేష 1, 2, 3, 4 పాదములు (డీ, డు, డే, డో)
ఈ వికారి నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి గురువు, ఏప్రిల్ 23 నుంచి నవంబర్ 5 వరకు 5వ ఇంట, వృశ్చిక రాశిలో ఆతర్వాత నవంబర్ 5 నుంచి ధనూరాశిలో, 6వ ఇంట సంచరిస్తాడు. శని జనవరి 24వ తేదీ వరకు 6వ ఇంట, ధనూరాశిలో ఆ తర్వాత 7వ ఇంట, మకర రాశిలో సంచరిస్తాడు. రాహువు సంవత్సరం అంతా మిథున రాశి లో 12వ ఇంట కేతువు 6వ ఇంటిలో ధనురాశిలో సంచరిస్తారు.

వృత్తి


ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి ప్రథమార్థం అనుకూల ఫలితాలను ద్వితీయార్ధం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. అనుకూలంగా ఉండటం అలాగే శని అనుకూలంగా ఉండటం వలన వృత్తిలో అనుకూలమైన మార్పులు చోటుచేసుకుంటాయి. మీ మాటకు విలువ పెరగడం అలాగే మీ ఆలోచనలను గౌరవించడం వాటిని ఆచరణలో రూపంలో తేవటం వలన మీకు గౌరవ మర్యాదలు పెరగటమే కాకుండా వృత్తిలో అభివృద్ధి కూడా జరుగుతుంది. పదోన్నతి కానీ అనుకూలమైన స్థితి కానీ మారాలని ప్రయత్నిస్తున్న వారికి ఈ సంవత్సరం నవంబర్ లోపు అనుకూలమైన ఫలితం లభిస్తుంది. గడచిన సంవత్సరం రాహు గోచారం కారణంగా మీకు ఎన్నో చేదు అనుభవాలు అనుకోని సమస్యలు ఎదురై ఉండవచ్చు. ఈ సంవత్సరం వాటి నుంచి బయటపడటమే కాకుండా మీ సహోద్యోగులు సహాయ సహకారాలు అందుకోవడం వారి ప్రేమాభిమానాలకు పొందడం జరుగుతుంది. నవంబర్ వరకు గురు దృష్టి లాభ స్థానం పై భాగ్య స్థానం పై మరియు జన్మస్థానం పై ఉండటం వలన చాలా విషయాల్లో లో అదృష్టం కలిసి వచ్చి ఆలస్యం అవ్వాల్సిన పనులు కూడా సులువుగా పూర్తవుతాయి. విదేశాలకు వెళ్లడానికి ప్రయత్నిస్తున్న వారు కానీ లేదా అక్కడ స్థిరపడాలనుకునేవారు కానీ ఈ సంవత్సరం అనుకూలమైన ఫలితాన్ని పొందుతారు. శని గోచారం జనవరి వరకు అనుకూలంగా ఉండటం వలన పై అధికారుల నుంచి సహాయ సహకారాలు పొందడమే కాకుండా వారి మెప్పును కూడా పొందుతారు. నవంబర్ ను గురువారం ఇంటికి రావటం, జనవరిలో శని ఎడమ ఇంటికి రావడం వలన వృత్తిలో మిశ్రమ ఫలితాలను పొందుతారు. బద్ధకం, నిర్లక్ష్యం ఎక్కువవటం అలాగే మీ మాట తీరు కూడా ఎవరిని లెక్క చేయని విధంగా మారడం వలన కొంత వ్యతిరేకతను ఎదుర్కోవలసి వస్తుంది. అలాగే కే రాహు గోచారం 12 ఇంట్లో ఉండటం వలన మానసికంగా ఆందోళనలో పెరగటం చేయాల్సిన పనులు వాయిదా పడడం మొదలైన ఫలితాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వ్యాపారస్తులు ఈ సంవత్సరం అనుకూల ఫలితాన్ని పొందుతారు. పంచమ స్థానంలో గురువారం అనుకూలంగా ఉండటం వలన వారు పెట్టిన పెట్టుబడులకు రెట్టింపు లాభాలు గడిస్తారు. అలాగే భాగస్వాములు సహాయంతో వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేయగలుగుతారు. జనవరిలో శని గోచారం మారటం వలన వ్యాపారం కొంత మందకొడిగా సాగుతోంది. ఈ సమయంలో పెట్టుబడుల విషయంలో అలాగే భాగస్వాముల విషయంలో కొంత జాగ్రత్త వహించడం మంచిది. అజాగ్రత్త నిర్లక్ష్యానికి తావివ్వకండి. మీ బద్ధకం లేదా నిర్లక్ష్యం కారణంగా కొంత డబ్బు నష్టపోయే అవకాశం ఉంది. కళాకారులు స్వయం ఉపాధి రంగంలో ఉన్నవారు ఈ సంవత్సరం చాలా అనుకూలమైన ఫలితాలను పొందుతారు. పంచమ స్థానంలో గురు గోచారం వారి ప్రతిభకు మంచి గుర్తింపును ప్రోత్సాహాన్ని ఇస్తుంది. అలాగే మంచి అవకాశాలు పొంది వారి రంగాల్లో లో స్థిర పడగలుగుతారు. జనవరి తర్వాత శని గోచారం సప్తమ స్థానంలో సంచరించే సమయంలో కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది. మీరు శ్రేయోభిలాషులు గా భావించేవారు మీ వెనుక గోతులు తవ్వే అవకాశం ఉంటుంది. మీకు రావలసిన అవకాశాలను పేరు ప్రతిష్టలను రాకుండా చేయటం లేదా మీ గురించి ప్రచారం చేయడం జరగవచ్చు. అటువంటి వారిని తొందరగా గుర్తించి పక్కన పెట్టడం వలన మీకు జరిగే నష్టాలు నివారించుకోవచ్చు.

కుటుంబం

ఈ సంవత్సరం మీ కుటుంబ జీవితం అనుకూలంగా ఉంటుంది. పంచమ స్థానంలో గురు గోచారం కారణంగా మీ పిల్లలు మంచి అభివృద్ధిలోకి వస్తారు. వారి కారణంగా మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. వివాహం కాని వారికి అలాగే సంతానం కాని వారికి ఈ సంవత్సరం అనుకూల ఫలితాలను ఇస్తుంది. గురువు దృష్టి లగ్న స్థానంపై అలాగే లాభ స్థానం గురు దృష్టి కారణంగా మీ మిత్రుల నుంచి మీకు సహాయ సహకారాలు అందుతాయి అలాగే మీకంటే పెద్దవారి నుంచి కూడా మీకు మంచి సహాయ సహకారాలు అందుతాయి. మీ కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. మీ మాటకు విలువ పెరగడమే కాకుండా మీరు ఇచ్చే సలహాలు పాటించి అభివృద్ధిలోకి వస్తారు. అయితే రాహు గోచారం పన్నెండవ స్థానంలో ఉండటం వలన కొంతమంది కుటుంబ సభ్యుల కారణంగా మీకు అసహనం చిరాకు పెరిగే అవకాశం ఉంది. అలాగే జనవరి తర్వాత శని సప్తమ స్థానానికి రావడం వలన మీ జీవిత భాగస్వామి తో మనస్పర్థలు ఏర్పడే అవకాశం ఉంది. వారి నుంచి సహాయ సహకారాలు తగ్గటం తద్వారా మీలో కోపం ఆవేశం పెరగడం జరగవచ్చు. అయితే గురు దృష్టి కుటుంబ స్థానంపై ఉండటం వలన సమస్యలు వచ్చినప్పటికీ వాటికి తొందరలో పరిష్కారాలు అవి పెద్దవి కాకుండా నివారింపబడతాయి.

ఆర్థికస్థితి


ఈ సంవత్సరం ఆర్థిక స్థితి మెరుగు గా ఉంటుంది. పంచమ స్థానంలో గురు గోచారం కారణంగా మీరు పెట్టిన పెట్టుబడులకు మంచి లాభాలు వస్తాయి అలాగే ఉద్యోగంలో కూడా పదోన్నతి ద్వారా ఆదాయం పెరగటం వలన ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేయాలనుకునే వారు సంవత్సరం నవంబర్ లోపు దాని కొరకు ప్రయత్నించడం మంచిది. గురువు అనుగ్రహం కారణంగా అనుకూలమైన ధరలో ఇల్లు లేదా వాహనాన్ని కొనుగోలు చేయగల్గుతారు. నవంబర్ తర్వాత గురు దృష్టి ఇ స్థానంపై ఉండటం వలన కూడా ఆర్థికంగా అనుకూలిస్తుంది. అయితే రాహువు గోచరము ఉండటం సప్తమ స్థానంలో శని కారణంగా కొంత అనవసరమైన ఖర్చులకు గురికావలసి వస్తుంది. జనవరి తర్వాత ఖర్చులు పెట్టుబడుల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది.

ఆరోగ్యం


ఈ సంవత్సరం ఆరోగ్యం విషయంలో ప్రథమార్థం అనుకూలంగా ద్వితీయార్థం మిశ్రమంగా ఉంటుంది. గురు గోచారం పంచమ స్థానంలో అనుకూలంగా ఉండటం వలన నవంబర్ వరకు ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని పెద్దగా బాధించవు. నవంబర్ తర్వాత గురు గోచారం మారటం అలాగే జనవరిలో శని గోచారం మారడం వలన కొన్ని ఆరోగ్య సమస్యలకు లో వస్తుంది. మెడ, తల పాదాలు మరియు కడుపుకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని భావించవచ్చు. పన్నెండవ ఇంట రాహు గోచారం కారణంగా మానసికంగా ఆందోళనకు లోనవడం లేని భయాన్ని ఊహించుకొని బాధపడటం తద్వారా డిప్రెషన్కు లోనవడం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మిమ్మల్ని మీరు ఏదో ఒక పనిలో నిమగ్నం చేసుకోవడం వలన ఈ ఆరోగ్య సమస్యల నుంచి దూరం ఆవగలుగుతారు .

చదువు

విద్యార్థులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. పంచమ స్థానంలో గురువు గోచారం కారణంగా పరీక్షల్లో అనుకున్నదానికంటే ఎక్కువ ఫలితాన్ని పొందుతారు. మీరు పడిన శ్రమకు తగిన ఫలితమే కాకుండా పేరును గుర్తింపును కూడా పొందుతారు. గురుదృష్టి ఉండటం వలన ఉన్నత విద్య విషయంలో ఎలాంటి అడ్డంకులు లేకుండా మంచి విద్యా సంస్థలు ప్రవేశాన్ని పొందగలుగుతారు. అలాగే విదేశాల్లో విద్యాభ్యాసం పూర్తి చేయాలని విద్యార్థులు కూడా సరైన ఫలితాన్ని పొందుతారు. అయితే రాహు గోచారం కారణంగా గా మానసికంగా కొంత ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంటుంది. చదువుతో పాటుగా ఇతర విషయాలపై కొంత దృష్టి నిలపడం వలన ఈ సమస్య దూరమయ్యే అవకాశం ఉంటుంది.

పరిహారాలు


ఈ సంవత్సరం చేయాల్సిన పరిహారాల విషయానికొస్తే ముఖ్యంగా రాహు అలాగే శనికి పరిహారాలు చేసుకోవడం మంచిది దాని వలన మానసిక ఆరోగ్య సమస్యలే కాకుండా శారీరక సమస్యలు కూడా దూరం అవుతాయి అలాగే ఆర్థిక స్థితి కూడా మెరుగుపడుతుంది దీనికి గాను రాహు గ్రహాలకు జపం చేసుకోవడం లేదా ఆ గ్రహాల స్తోత్ర పారాయణం చేయడం మంచిది అలాగే ఆంజనేయ స్వామికి దుర్గాదేవి సంబంధిత స్తోత్ర పారాయణం చేయడం కూడా అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది.

No comments:

Post a Comment