Friday 5 April 2019

వృషభ రాశి రాశిఫలములు వికారి నామ సంవత్సర రాశి ఫలములు

vrishabha rashi telugu predictions vijaya telugu year
 కృత్తిక నక్షత్రం 2,3,4 పాదములు (ఈ,ఊ,ఏ) రోహిణి నక్షత్రం 1,2,3,4 పాదములు,(ఓ,వా,వీ,వూ) , మృగశిర నక్షత్రం 1,2 పాదములలో (వే,వో) జన్మించిన వారు వృషభ రాశి జాతకులు
ఈ వికారి నామ సంవత్సరంలో వృషభ రాశి వారికి గురువు, ఏప్రిల్ 23 నుంచి నవంబర్ 5 వరకు ఏడవ ఇంటిలో, వృశ్చిక రాశిలో సంచరిస్తాడు. నవంబర్ 5 నుంచి ధనూరాశిలో, 8వ ఇంట సంచరిస్తాడు. శని జనవరి 24వ తేదీ వరకు 8వ ఇంట, ధనూరాశిలో ఆ తర్వాత 9వ ఇంటిలో, మకర రాశిలో సంచరిస్తాడు. రాహువు సంవత్సరం అంతా మిథున రాశి లో 2వ ఇంట కేతువు 8వ ఇంటిలో ధనురాశిలో సంచరిస్తారు.
ఈ సంవత్సరం మీకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రథమార్థం సానుకూలంగా ఉన్నప్పటికీ ద్వితీయార్ధంలో ఖర్చులు పెరగడం లాంటి ఫలితాలు ఉంటాయి.

ఉద్యోగం


ఈ సంవత్సరం ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది. గడచిన సంవత్సరంలో శని గోచారం అనుకూలంగా లేకపోవడం వలన వృత్తిపరంగా చాలా సమస్యలను ఎదుర్కోవలసి వచ్చింది. ఈ సంవత్సరం నవంబర్ వరకు గురు సంచారం అనుకూలంగా ఉండటం అలాగే జనవరి నుంచి శని అష్టమ స్థానం నుంచి నవమ స్థానానికి సంచరించడం వలన వృత్తిలో అనుకూల వాతావరణాన్ని పొందుతారు. జనవరి వరకు మీ ఉద్యోగంలో చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ గురువారం అనుకూలంగా ఉండటం వలన వాటిని తట్టుకొని బయటపడగలుగుతారు. ఈ సమయంలో మీ పై అధికారులతో అలాగే సహోద్యోగులతో మనస్పర్థలు రావటం దాని కారణంగా ఆఫీస్ లో ప్రశాంత వాతావరణాన్ని కోల్పోవడం జరుగుతుంది. మీ గురించి వ్యతిరేక ప్రచారం జరగడం, అలాగే కావాలని మిమ్మల్ని అవమానించడం లేదా తక్కువ చేసి మాట్లాడటం జరుగుతుంది. అయితే గురు గోచారం అనుకూలంగా ఉండటం వలన వ్యతిరేకులతో పాటుగా మిమ్మల్ని సమర్థించేవారు ఉండటం అలాగే చెడు చేద్దాం అనుకునే వారు కూడా ఇబ్బందుల పాలు అవడం వలన మీకు పెద్దగా ఇబ్బందికర వాతావరణం ఉండదు. అయితే కొన్నిసార్లు ఈ వ్యతిరేక వాతావరణం వలన వృత్తి పట్ల ఆసక్తి తగ్గడం విపరీతమైన ఒత్తిడికి లోనవడం జరగవచ్చు. వీలైనంతవరకు ఇలాంటి విషయాలను పట్టించుకోకుండా ఉండటం వలన మీరు ఒత్తిడి నుంచి బయటపడగలుగుతారు అలాగే మీ పనికి గుర్తింపు లభిస్తుంది. శని దృష్టి వాక్ స్థానంపై ఉండటం వలన మీ మాట తీరు కారణంగా కూడా సమస్యలు ఎదుర్కునే అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత తక్కువగా మాట్లాడటం మంచిది లేదా అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండటం మంచిది. ఉద్యోగంలో మార్పు కోరుకునేవారు నవంబర్ లోపు కానీ లేదా జనవరి తర్వాత కానీ ప్రయత్నం చేయటం మంచిది. ముఖ్యంగా జనవరి తర్వాత వృత్తి తో పాటు ప్రదేశంలో కూడా మార్పు కనిపిస్తున్నది. వ్యాపారస్తులకు ఈ సంవత్సరం ప్రథమార్థం బాగా కలిసొస్తుంది. వ్యాపారం అభివృద్ధి చెందడమే కాకుండా ఆదాయం కూడా పెరుగుతుంది. అయితే అష్టమ శని కారణంగా కొన్నిసార్లు తీసుకున్న తప్పుడు నిర్ణయాలు కొంత నష్టం కూడా ఇవ్వొచ్చు. తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి మంచిది. కొత్తగా పెట్టుబడులకు నవంబర్ వరకు అనుకూల సమయం. నవంబర్ తర్వాత గురు అష్టమ స్థానంలో సంచరిస్తాడు కాబట్టి భారీ పెట్టుబడులకు అనుకూల సమయం కాదు. కళాకారులు స్వయం ఉపాధి రంగంలో ఉన్నవారు ఈ సంవత్సరం అనుకూల ఫలితాలు పొందుతారు. ముఖ్యంగా ద్వితీయార్ధంలో మంచి అవకాశాల కారణంగా పేరు ప్రతిష్ఠలు సంపాదిస్తారు.

కుటుంబం

ఈ సంవత్సరం కుటుంబ విషయంలో కొంత మధ్యస్థంగా ఉంటుంది. శని దృష్టి కుటుంబ స్థానం పై ఉండటం వలన అలాగే రాహు గోచారం కుటుంబ స్థానంలో జరగడం వలన కొంత అసౌకర్య వాతావరణం ఏర్పడుతుంది. కుటుంబ సభ్యుల మధ్య కలహాలు, మనస్పర్థలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అయితే నవంబర్ వరకు గురు సంచారం అనుకూలంగా ఉండటం అలాగే జనవరి తర్వాత శని అష్టమ స్థానం నుంచి స్థానానికి మారటం వలన కొంత అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. రాహు స్థితి మరియు శని దృష్టి కారణంగా మీ మాట తీరుతో కుటుంబ సభ్యులను బాధకు గురి చేసిన వారవుతారు వీలైనంతవరకు తొందరపడి మాట్లాడకుండా అర్థం చేసుకుని మాట్లాడటం మంచిది. అలాగే బంధుమిత్రులతో స్నేహితులతో అనవసర వివాదాలకు తావివ్వకుండా జాగ్రత్త పడండి. సప్తమ స్థానంలో గురు గోచారం కారణంగా మీ జీవిత భాగస్వామికి వృత్తిలో అభివృద్ధి కలగటం అలాగే జీవితంలో విజయాలు సాధించడం మొదలైన శుభఫలితాలుంటాయి. గురు దృష్టి సప్తమ స్థానం నుంచి లాభ స్థానం పై అలాగే మూడవ ఇంటిపై ఉండటం వలన మీ మిత్రుల నుంచి మరియు బంధువుల నుంచి కొంత సహాయ సహకారాలు అందుతాయి అలాగే మీ సోదరుల నుంచి మీకు సాయం అందుతుంది. వివాహం కాకుండా సరైన సమయం కొరకు ఎదురు చూస్తున్న వారు ఈ సంవత్సరం అనుకూల ఫలితాన్ని పొందుతారు, ముఖ్యంగా ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్యలో వీరికి వివాహ ఘడియలు. అలాగే గతంలో మీ జీవిత భాగస్వామి తో మీరు ఏర్పడిన మనస్పర్థలు తొలగిపోయి ఇంట్లో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది.

ఆర్థికస్థితి


ఈ సంవత్సరం ఆర్థికంగా మిశ్రమంగా ఉంటుంది. ఆదాయం అధికంగా ఉన్నప్పటికీ ఖర్చుల కారణంగా ఆదాయ వ్యయాలు మధ్యలో వ్యత్యాసం పెద్దగా ఉండదు. శని దృష్టి ఉండటం వలన అనవసర విషయాల్లో ఎక్కువ ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఇల్లు కాని. వాహనం కానీ కొనాలనుకునేవారు నవంబర్ లోపు కొనడం మంచిది. నవంబర్ తర్వాత గురు గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి ఖర్చులు, పెట్టుబడుల విషయంలో కొంత జాగ్రత్త అవసరం. రెండో ఇంట్లో రాహు గోచారం కారణంగా గొప్పలకు పోయి అనవసరంగా డబ్బు ఖర్చు పెడతారు కాబట్టి ఖర్చుల విషయంలో లో ముందు వెనకా చూడక ఖర్చుచేయడం తగ్గించాల్సి ఉంటుంది.

ఆరోగ్యం

ఆరోగ్య విషయంలో ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. నవంబర్ వరకు గురు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఇ ఆరోగ్య సమస్యలు పెద్దగా ఉండవు అయితే నవంబర్ తర్వాత గురువు శని జనవరి వరకు అష్టమ స్థానంలో సంచరిస్తారు దీని కారణంగా కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఊపిరితిత్తులు కాలేయము ఎముకలు మరియు మేడ సంబంధించిన అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది సంవత్సరమంతా ఉంటుంది కాబట్టి చర్మ సంబంధ అనారోగ్యం మరియు మానసిక ఆందోళనలు కలిగే అవకాశం ఉంటుంది. ఆహారపు అలవాట్ల విషయంలో కొంత జాగ్రత్త వహించడం అలాగే శారీరక శ్రమ చేయడం వలన ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి

చదువు

విద్యార్థులకు ఈ సంవత్సరం కొంత అనుకూలంగా ఉంటుంది పరీక్షల్లో అనుకున్న ఫలితాలు సాధించడమే కాకుండా మంచి ఉన్నత విద్యా యోగం కూడా ఈ సంవత్సరం ఉంటుంది. అయితే స్థానంలో రాహువు అష్టమ స్థానంలో శని సంచారం కారణంగా చదువు విషయంలో కొంత అహంభావానికి అలాగే తొందరపడి లోనయ్యే అవకాశం ఉంటుంది దాని కారణంగా రావలసిన అన్ని మార్కులు రాక ఇబ్బంది పడవచ్చు కాబట్టి చదువు విషయంలో ఎటువంటి నిర్లక్ష్యాన్ని వాయిదా వేసే స్వభావాన్ని దగ్గరికి రాకుండా చూసుకోండి. జనవరి నుంచి శని భాగ్య స్థానంలో సంచరించడం వలన ఉన్నత విద్య విషయంలో కొన్ని అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది.

పరిహారాలు

ఈ సంవత్సరం మీరు ముఖ్యంగా శనికి మరియు కేతువు అలాగే నవంబర్ తర్వాత గురువుకు పరిహారాలు చేసుకోవడం మంచిది దీనివలన ఖర్చు తగ్గడమే కాకుండా ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి అలాగే విద్యార్థులకు మంచి ఫలితాలు లభిస్తాయి దీనికిగాను శని కేతు మరియు గురు లేదా ఈ గ్రహాల పూజ చేసుకోవడం మంచిది అలాగే ఆంజనేయ గణేశా మరియు దత్తాత్రేయ స్వామి కి సంబంధించిన స్తోత్ర పారాయణం కూడా మంచి ఫలితాలనిస్తుంది ఉన్నంతకాలం శారీరక శ్రమ చేయడం, అలాగే ఇతరులకు సహాయం చేయడం an వలన శని ప్రభావం తగ్గుముఖం పడుతుంది.

No comments:

Post a Comment