Friday 5 April 2019

తులా రాశిఫలములు వికారి నామ సంవత్సర రాశిఫలములు

తులారాశి జయ రాశి ఫలాలు
చిత్త 3, 4 పాదాలు (ర,రి),
స్వాతి నాలుగు పాదాలు (రు, రె, రో,త),
విశాఖ 1, 2, 3 పాదాలు (తి, తు, తే)
ఈ వికారి నామ సంవత్సరంలో తులా రాశి వారికి గురువు, ఏప్రిల్ 23 నుంచి నవంబర్ 5 వరకు 2వ ఇంట, వృశ్చిక రాశిలో ఆతర్వాత నవంబర్ 5 నుంచి ధనూరాశిలో, 3వ ఇంట సంచరిస్తాడు. శని జనవరి 24వ తేదీ వరకు 3వ ఇంట, ధనూరాశిలో ఆ తర్వాత 4వ ఇంట, మకర రాశిలో సంచరిస్తాడు. రాహువు సంవత్సరం అంతా మిథున రాశి లో 9వ ఇంట కేతువు 3వ ఇంటిలో ధనురాశిలో సంచరిస్తారు.

వృత్తి


ఈ సంవత్సరం తులా రాశి వారికి ప్రథమార్థం అనుకూలంగా ఉంటుంది. ద్వితీయార్ధం కొంత సామాన్యంగా ఉంటుంది. నవంబర్ వరకు గురు గోచారం అలాగే జనవరి వరకు శని గోచారం అనుకూలంగా ఉండటం వలన ఉద్యోగంలో మంచి ప్రగతి సాధిస్తారు. గురు దృష్టి దశమ స్థానం పై ఉండటం వలన కీర్తి ప్రతిష్టలు కలగటం, మీ పనులకు మీరు చెప్పే సలహాలకు విలువ పెరగడం జరుగుతుంది. మీ సహోద్యోగులు కానీ మీ పై అధికారులు కానీ మీ సలహాలు సూచనలు తీసుకుంటారు. ఉద్యోగంలో ప్రమోషన్ కానీ మంచి మార్పు కానీ నవంబర్ లోపు ఉంటుంది. అంతేకాకుండా విదేశీయానం కొరకు లేదా స్థల మార్పిడి కొరకు ప్రయత్నం చేస్తున్న వారికి కూడా ఈ సంవత్సరం అనుకున్న ఫలితం లభిస్తుంది. పదోన్నతి కొరకు లేదా ఉద్యోగం కొరకు మీరు రాసే పరీక్షలు కానీ ప్రయత్నాలు కానీ విజయవంతమవుతాయి. అయితే రాహు గోచారం నవమ స్థానంలో ఉండటం వలన కొన్నిసార్లు మీరు చేసే ప్రయత్నాలు చివరి నిమిషంలో ఆగిపోవడం కానీ వాయిదా పడడం గానీ జరగవచ్చు. ఒకటి కంటే ఎక్కువ సార్లు ప్రయత్నం చేయడం వలన ఆ పనులను పూర్తి చేయగలుగుతారు. శని గోచారం జనవరి వరకు అనుకూలంగా ఉండటం వలన విదేశీ యానం విషయంలో మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే వృత్తిలో ప్రశంసలు లభించడం కానీ మీ సహోద్యోగుల మెప్పు పొందడం కానీ జరుగుతుంది. అయితే జనవరి తర్వాత శని నాలుగు ఇంటికి మారటం నవంబర్ లో గురువు మూడో ఇంటికి మారటం వలన కొంత వ్యతిరేకత చోటు చేసుకుంటుంది. చేపట్టిన పనులు ఆలస్యం అవడం, మీరు చెప్పిన విషయాలు సరిగా అర్థం చేసుకోక ఆఫీస్ లో కొన్ని తప్పులు జరగటం దానికి మిమ్మల్ని బాధ్యులు చేయడం జరగవచ్చు. కాబట్టి ఇ ఇ చెప్పే విషయాలను ఒకటికి రెండుసార్లు అర్థమయ్యేలా చెప్పడం మంచిది. అలాగే జనవరి నుంచి పని ఒత్తిడి పెరుగుతుంది. అదనపు బాధ్యతలు చేపట్టాల్సి రావటం లేదా గొప్పలకు పోయి ఇతరుల పని నెత్తిన పెట్టుకోవడం జరగవచ్చు. ఏ విషయంలో అయినా కొంత జాగ్రత్త వహించడం తొందరపాటు కాకుండా ఉండటం వలన చాలా వరకు సమస్యలు తొలగిపోతాయి. వ్యాపారస్తులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. నవంబర్ వరకు గురు గోచారం బాగుండటం వలన వ్యాపారంలో మంచి లాభాలు గడిస్తారు. అలాగే మీ ఆర్థిక స్థితి కూడా మెరుగవుతుంది. కొత్తగా ప్రారంభించడానికి కానీ లేదా పెట్టుబడులు పెట్టడానికి కానీ ఈ సంవత్సరం నవంబర్ వరకు అనుకూలంగా ఉంటుంది. గురుబలం బాగుండటం వలన పెట్టిన పెట్టుబడులకు మంచి లాభాలను గడిస్తారు. నవంబర్ తర్వాత గురు గోచారంలో మార్పు రావడం వలన వ్యాపారంలో కొన్ని మార్పులు జరుగుతాయి. కొత్తగా భాగస్వామి రావడం కానీ లేదా వ్యాపారం చేసే ప్రదేశంలో మార్పు గాని జరుగుతుంది. జనవరి తర్వాత శని అనుకూలంగా ఉండదు కాబట్టి ఇ వ్యాపారంలో పెట్టుబడులు కానీ లేదా ఇతర మార్పులు గాని అంతగా అనుకూలించవు. పని ఒత్తిడి పెరుగుతుంది అలాగే ఎంత పని చేసినప్పటికీ ఆదాయం మాత్రం పెద్దగా మార్పు ఉండకపోవచ్చు. కళాకారులకు స్వయం ఉపాధి ద్వారా జీవనం సాగిస్తున్న వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. గురు గోచారం బాగుండటం వలన నవంబర్ వరకు మీరు మీ వృత్తిలో మంచి అభివృద్ధిని సాధిస్తారు. మీ కళకు గాని, మీ ప్రతిభ కానీ మంచి గుర్తింపు లభిస్తుంది. శని గోచారం కూడా అనుకూలంగా ఉండటం వలన మీ పనిలో తీరిక లేకుండా ఉంటారు. రు అయితే నవంబర్ తర్వాత గురు గోచారం కొంత సామాన్యంగా ఉండటం జనవరిలో అర్ధాష్టమ శని సమయం ప్రారంభం అవడం వలన కొంత సామాన్యంగా ఉంటుంది దీని కారణంగా మీరు చేసే పనులు రావడం కానీ లేదా మీ గురించి తప్పుడు ప్రచారాలు చేయడం గానీ జరగవచ్చు. ఎవరికి కూడా గుడ్డిగా నమ్మకుండా మీ జాగ్రత్తలో మీరు ఉండటం మంచిది.

కుటుంబం

ఈ సంవత్సరం కుటుంబ జీవితం అనుకూలంగా ఉంటుంది గురువు మరియు శని గోచారం అనుకూలంగా ఉండటం వలన మీ కుటుంబంలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉండే అపోహలు కానీ గొడవలు కానీ తొలగిపోయి మీ మధ్య ప్రేమాభిమానాలు పెరుగుతాయి. మీ కుటుంబ సభ్యుల నుంచి మీకు సహాయ సహకారాలు అందుతాయి. వివాహం కాని వారికి కానీ లేదా సంతానం కొరకు ఎదురుచూస్తున్న వారి కానీ ఈ సంవత్సరం అనుకున్న ఫలితం ఉంటుంది. నవంబర్లో గురువు మారటం అలాగే జనవరిలో శని మారటం వలన కొన్ని విషయాలలో వ్యతిరేకతను తక్కువ సహకారాన్ని కుటుంబ సభ్యుల నుంచి పొందుతారు. మీ గురించి చెడుగా తెలియడం కానీ లేదా అపోహల కారణంగా కానీ కుటుంబ సభ్యుల కోపానికి కారణం అవుతారు. ఏ విషయంలో అయినా నిజాయితీగా ఉండటం వీలైనంత వరకు కుటుంబ సభ్యులతో మంచి చెడులు పెంచుకోవడంవలన చాలా సమస్యలు దూరం అవుతాయి. మూడవ గురు గోచారం తొమ్మిదవ ఇంట రాహు గోచారం కారణంగా కుటుంబ సభ్యులను ఒకరికి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. నవంబర్ వరకు గురువారం బాగా ఉండటం వలన మీ పిల్లలు మంచి అభివృద్ధిలోకి వస్తారు అలాగే మీ తల్లి తరపు బంధువులు నుంచి సహాయ సహకారాలు అందుకుంటారు.

ఆర్థిక స్థితి


ఈ సంవత్సరం నవంబర్ వరకు గురు గోచారం రెండవ అనుకూలంగా ఉండటం వలన ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉంటుంది. అనుకోని ధనాదాయం రావడం కానీ లేదా వృత్తి వ్యాపారాల్లో ఆదాయం పెరిగి మీ ఆర్థిక స్థితి మెరుగు పడుతుంది. అలాగే కోర్టు కేసులు కానీ భూ వివాదాలు కానీ తొలగిపోయి మీకు ఆదాయం వచ్చే అవకాశం ఉన్నది. పెట్టుబడులకు నవంబర్ వరకు సమయం అనుకూలంగా ఉంటుంది. వాహనం కానీ లేదా భూమి కాని కొనుగోలు చేయాలనుకునే వారు నవంబర్ లోపు చేయడం మంచిది నవంబర్ తర్వాత గురు బలం తగ్గుతుంది కాబట్టి పెట్టుబడులకు కొనుగోళ్లకు అంతగా అనుకూలించే సమయం కాదు. జనవరి నుంచి అర్ధాష్టమ శని గోచారం ప్రారంభమవుతుంది కాబట్టి ఆర్థిక విషయాలలో కొంత జాగ్రత్త అవసరం. అప్పులు,లోన్లు తీసుకోవడం తప్పనిసరి పరిస్థితి అయినప్పుడు మాత్రమే వాటి గురించి ఆలోచించడం మంచిది.

ఆరోగ్యం


ఈ సంవత్సరం ప్రథమార్థంలో ఆరోగ్య స్థితి మెరుగ్గా ఉంటుంది. లో గురు శని అనుకూలంగా ఉండటం వలన పెద్దగా ఆరోగ్య సమస్యలు బాధించవు. గతంలో ఉన్న అనారోగ్య సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి. శని గోచారం జనవరి వరకు అనుకూలంగా ఉండటం కూడా ఆరోగ్య విషయంలో మంచి ఫలితాన్ని ఇస్తుంది. అయితే నవంబర్లో గురు మూడో ఇంటికి రావడం అలాగే జనవరిలో శని నాలుగవ ఇంటికి రావడం వలన కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. చేతులు కాళ్లు మరియు చెవులకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు బాధించవు. అలాగే అతిగా ప్రయాణాలు చేయడం వలన లేదా అతిగా శ్రమ చేయడం వలన కూడా కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. వీటి కారణంగా ఊపిరితిత్తుల సమస్యలు కానీ అలర్జీలు కానీ లేదా నడుముకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.

చదువు

విద్యార్థులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. నవంబర్ వరకు బాగుండటం వలన చదువులో బాగా రాణిస్తారు . చదువు మీద ఆసక్తి పెరగడం పోటీతత్వం పెరగడం వలన పరీక్షలలో మంచి ఫలితాలు సాధిస్తారు. శని గోచారం కూడా జనవరి వరకు అనుకూలంగా ఉండటం వలన విద్య కారణంగా పేరు ప్రతిష్ఠలు సంపాదిస్తారు. ఉన్నత విద్యాభ్యాసం కొరకు అనుకూల ఫలితాలు పొందుతారు. అయితే జనవరి నుంచి శని గోచారం అనుకూలంగా లేకపోవడం వలన చదువు పట్ల ఆసక్తి కొంత సన్నగిల్లే అవకాశం ఉన్నది. అలాగే బద్ధకం పెరగడం స్వభావం పెరగడం వలన పరీక్షల్లో అనుకున్న విధంగా ఫలితాలు సాధించలేకపోవచ్చు. కాబట్టి నిర్లక్ష్యానికి బద్ధకానికి తావివ్వకుండా కష్టపడి చదివినట్లయితే మంచి ఫలితాలు సాధిస్తారు.

పరిహారాలు

ఈ సంవత్సరం శని రాహులు కొంత అనుకూలంగా ఉండరు కాబట్టి ఈ రెండు గ్రహాలకు పరిహారాలు చేయడం మంచిది. దీనివలన వృత్తిలో లో చేసే పనిలో ఆటంకాలు తగ్గి విజయం సాధించ గలుగుతారు. దీనికిగాను శని మరియు రాహువు జపం చేయటం లేదా శని రాహు సంబంధ స్తోత్ర పారాయణం చేయడం లేదా హనుమాన్ చాలీసా మరియు దుర్గా స్తోత్ర పారాయణం చేయడం వలన చాలా సమస్యలు తొలగిపోయి ఈ సంవత్సరం అనుకూల ఫలితాలను పొందుతారు

No comments:

Post a Comment