Friday 5 April 2019

మీన రాశిఫలములు వికారి నామ సంవత్సర రాశిఫలములు

Kanya rashi telugu year predictions
పూర్వాభాద్ర 4వ పాదం (ది)
ఉత్తరాభాద్ర 4 పాదాలు (దు, శం, ఝ, థ)
రేవతి 4 పాదాలు (దే, దో, చ, చి)
ఈ వికారి నామ సంవత్సరంలో మకర రాశి వారికి గురువు, ఏప్రిల్ 23 నుంచి నవంబర్ 5 వరకు 9వ ఇంట, వృశ్చిక రాశిలో ఆ తర్వాత నవంబర్ 5 నుంచి ధనూరాశిలో, 10వ ఇంట సంచరిస్తాడు. శని జనవరి 24వ తేదీ వరకు 10వ ఇంట, ధనూరాశిలో ఆ తర్వాత 11వ ఇంట, మకర రాశిలో సంచరిస్తాడు. రాహువు సంవత్సరం అంతా మిథున రాశి లో 4వ ఇంట కేతువు 10వ ఇంటిలో ధనురాశిలో సంచరిస్తారు.

వృత్తి


ఈ సంవత్సరం మీన రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. సంవత్సరం అంతా గురు గోచారం మరియు శని గోచారం అనుకూలంగా ఉండటం వలన వృత్తిలో మంచి అభివృద్ధి సాధిస్తారు. నవంబర్ వరకు గురువు తొమ్మిదవ ఇంట అనుకూలంగా ఉండటం వలన మీ ఉద్యోగానికి సంబంధించి మీ నైపుణ్యాన్ని పెంచుకోవడానికి అలాగే మీరు వృత్తిలో అభివృద్ధి చెందడానికి మంచి అవకాశాలు లభిస్తాయి. మీ పై అధికారుల ప్రోత్సాహం వలన మీ వృత్తిలో మీరు బాగా రాణిస్తారు. కొంతకాలం విదేశీ ప్రయాణం చేయడం కానీ దూర ప్రాంతంలో ఉద్యోగం చేయడం కానీ చేస్తారు. అలాగే మిగతా వారికి రాని అవకాశాలు మీకు రావటం వలన భవిష్యత్తులో ఉద్యోగ విషయంలో మరింత అభివృద్ధి సాధ్యం అవుతుంది. జనవరి వరకు శని దశమ స్థానంలో శనివారం నుంచి లాభ స్థానంలో ఉండటం వలన మీ సహోద్యోగులు నుంచి సహాయ సహకారం ఉండడమే కాకుండా ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది అలాగే పదోన్నతి లభిస్తుంది. దశమంలో శని గోచారం మరియు కేతు గోచారం కారణంగా కొన్నిసార్లు ఉద్యోగ విషయంలో ఆందోళనకు గురి అవుతారు. కొన్నిసార్లు ఉద్యోగ నష్టం జరుగుతుందనే భయాందోళన కారణంగా మానసిక ప్రశాంతతను కోల్పోతారు. అలాగే చతుర్థ స్థానంలో రాహు గోచారం కారణంగా కొన్నిసార్లు పని ఒత్తిడి అధికంగా ఉండటం అలాగే నీకు ఇష్టం లేకున్నా వేరే ప్రదేశాల్లో పనిచేయాల్సి రావడం జరుగుతుంది. అయితే ఆ సమయంలో కొంత ఇబ్బంది కలిగినా అది మీరు కొత్త విషయాలు నేర్చుకోవడానికి మీ నైపుణ్యాన్ని మరింత అభివృద్ధి చేసుకోవడానికి సహాయకారిగా ఉంటుంది. నవంబర్ ను గురువు దశమ స్థానం లోకి రావడం వలన వృత్తిలో మార్పులు చోటుచేసుకుంటాయి. జనవరిలో శని లాభ స్థానంలో ఉండటం వలన మీ వృత్తిలో ఉన్నతస్థాయికి చేరుకుంటారు. అయితే దశమంలో గురువు గోచారం కారణంగా కొన్నిసార్లు గర్వానికి అతి విశ్వాసానికి లోనవుతారు దాని కారణంగా మీ సహోద్యోగులు కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా వృత్తిపట్ల ఏకాగ్రతని కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండటం వలన మీ వృత్తిలో మరింత అభివృద్ధి సాధిస్తారు. వ్యాపారస్తులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. గురు శని గోచారం బాగుండటం వలన మీ వ్యాపారంలో అనుకోని అవకాశాలు వచ్చి మంచి అభివృద్ధి సాధిస్తారు. ఆర్థికంగా కూడా మీరు పెట్టిన పెట్టుబడులకు రెట్టింపు ఆదాయాన్ని గడిస్తారు. అయితే చతుర్థ స్థానంలో రాహువు గోచరము కారణంగా విశ్రాంతి లేని జీవితాన్ని గడుపుతారు. దాని కారణంగా చాలాసార్లు అసహనానికి ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉన్నది. నవంబర్ వరకు గురు బలం అనుకూలంగా ఉంటుంది కాబట్టి కొత్తగా వ్యాపారం ప్రారంభించడానికి కానీ పెట్టుబడులు పెట్టడానికి కానీ అనుకూలంగా ఉంటుంది. నవంబర్ తర్వాత గురు గోచారం పదవ ఇంటిలో ఉండే సమయంలో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడం అంతగా అనుకూలం కాదు. కళాకారులు స్వయం ఉపాధితో జీవనోపాధి నడుచుకునేవారు ఈ సంవత్సరం అవకాశాలను పొందుతారు. అనుకోని విధంగా వచ్చే అవకాశాలు మీకు పేరు ప్రతిష్టలను డబ్బును ఇస్తాయి. మీ ప్రతిభను కళను మరింతగా అభివృద్ధి చేసుకునే అవకాశాలు ఈ సంవత్సరం మీకు లభిస్తాయి. అంతేకాకుండా మీ ప్రతిభకు తగిన పురస్కారం ప్రజల నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ లభిస్తుంది. నవంబర్ వరకు గురు దృష్టి పంచమ స్థానం మీద ఉండటం వలన మీ సృజనాత్మకత కారణంగా మీరు మరింత అభివృద్ధిని సాధిస్తారు.

కుటుంబం


ఈ సంవత్సరం గురు గోచారం అనుకూలంగా ఉండటం వలన మీ కుటుంబ జీవితం బాగుంటాడని సూచిస్తోంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమాభిమానాలు పెరగటం అలాగే ఇంట్లో శుభకార్యాలు జరగటం వలన ఇంట్లో సందడిగా ఉంటుంది. నవంబర్ వరకు గురువు భాగ్య స్థానంలో ఉండటం వలన మీ కుటుంబ సభ్యులతో కలిసి పుణ్య క్షేత్ర సందర్శన చేయడం కానీ లేదా మహానుభావువ సందర్శనం చేయడం కానీ జరుగుతుంది. అలాగే మీ తండ్రిగారి ఆరోగ్యం మెరుగు పడుతుంది. కుటుంబ సభ్యుల మధ్యన ఉండే గొడవలు కానీ మనస్పర్ధలు కానీ సమసిపోతాయి. ఈ సంవత్సర ప్రథమార్థంలో వివాహం కొరకు దాని సంతానం కొరకు గాని ఎదురుచూస్తున్న వారికి అనుకూల ఫలితం లభిస్తుంది. చతుర్థ స్థానంలో రాహువు గోచరము కారణముగా మీరు మీ కుటుంబానికి దూరంగా కొంతకాలం ఉండవలసి వస్తుంది. ఇది ఉద్యోగంలో మార్పు వలన కాని లేదా ఉన్నత విద్య కారణంగా కానీ అయ్యే అవకాశం ఉన్నది. అయితే రాహు మానసిక ఒత్తిడి ఇస్తాడు కాబట్టి కొంత ఒంటరితనానికి లోనయ్యే అవకాశం ఉంటుంది. అయితే గురు గోచారం బాగుండటం వలన మిత్రులు శ్రేయోభిలాషుల కారణంగా ఈ ఒంటరితనానికి దూరం అవుతారు. నవంబర్లో గురువు దృష్టి నాలుగవ ఇంటి పై ఉండటం వలన మానసిక ఒత్తిడి తగ్గి ప్రశాంతత ఏర్పడుతుంది. లాభంలో శని గోచారం కారణంగా మీ కుటుంబంలో పెద్దవారి వలన మీకు అనుకోని ఆనందం లభిస్తుంది.

ఆర్థిక స్థితి


ఈ సంవత్సరం మీ ఆర్థిక స్థితి మెరుగ్గా ఉంటుంది. భాగ్య స్థానంలో గురు సంచారం కారణంగా అనుకోని అవకాశాలు వచ్చి ఆర్థిక లాభాలు కలుగుతాయి. అలాగే అదృష్టం కలిసి వచ్చి గృహ వాహనాదులను కొనుగోలు చేస్తారు. శని స్థితి కూడా ఉండటం వలన ఉద్యోగం కారణంగా కానీ వ్యాపారం కారణంగా కానీ సమృద్ధి కరమైన ధనాదాయం ఉంటుంది. నవంబర్ వరకు గురు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో పెట్టుబడులు పెట్టడానికి కానీ లేదా ఇల్లు వాహనం మొదలైనవి కొనడానికి గాని అనుకూలంగా ఉంటుంది. నవంబర్ తర్వాత గురువు పదవి ఇంటికి మారతాడు కాబట్టి ఈ సమయంలో ఆర్థిక స్థితి బాగున్నప్పటికీ పెట్టుబడులు పెట్టడానికి అనుకూల సమయం కాదు. జనవరిలో శని పదకొండు ఇంటికి వస్తారు కాబట్టి ఈ సమయంలో ఆర్థిక స్థితి బాగుంటుంది గతంలో చేసిన అప్పులు కానీ లోను కానీ తీర్చే కలుగుతారు.

ఆరోగ్యం


ఈ సంవత్సరం గురు శనుల గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది. పెద్దగా ఆరోగ్య సమస్యలు లేకుండా ఈ సంవత్సరం గడిచిపోతుంది. అయితే నాలుగవ ఇంట రాహు గోచారం కొన్ని ఆరోగ్య సమస్యలను అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కడుపు, మెడ మరియు గ్యాస్ సంబంధ అనారోగ్యాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. ఈ సమస్య తరచూ ప్రయాణాలు చేయటం అలాగే సమయానికి భోజనం చేయకపోవడం వలన ఈ సంవత్సరం మీకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉన్నట్లయితే ఈ ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని పెద్దగా బాధించవు. సంవత్సరమంతా గురుబలం బాగుంటుంది కాబట్టి ఆరోగ్య సమస్యలు వచ్చినా తొందరగానే తగ్గుముఖం పడతాయి.

చదువు


విద్యార్థులకు ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. భాగ్య స్థానంలో గురువు గోచారం వారు కొత్త విషయాలు నేర్చుకోవడానికి వారి నైపుణ్యాన్ని మెరుగు పరుచుకోవడానికి అనుకూలిస్తుంది. వారిలో ఉన్న ప్రతిభ బయటకి రావడం వలన సమాజంలో వారికి పేరు ప్రతిష్టలు రావటం అలాగే విద్యలో ఉన్నతస్థాయికి చేరుకోవడం జరుగుతుంది. నవంబర్ వరకు గురు గోచారం చాలా అనుకూలంగా ఉండటం వలన వారి చదువుతో పాటుగా దైవానుగ్రహం కూడా తోడై విద్యలో బాగా రాణిస్తారు. గొప్ప వారి సలహాలు సూచనలు అనుకుంటారు. నవంబర్ తర్వాత దృష్టి చతుర్ధ స్థానం మీద ఉండటం వలన వారికి చదువుపై మరింత శ్రద్ధ పెరుగుతుంది. అయితే చతుర్ధ స్థానంలో రాహు గోచారం కారణంగా కొన్నిసార్లు చదువు మీద శ్రద్ధ కంటే ఎక్కువ గర్వం పెరిగి నిర్లక్ష్యం చేయడం జరుగుతుంది దానివలన పరీక్షలలో అనుకున్న ఫలితాలు రాకపోతే అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంతవరకు చదువు మీద దృష్టి మరలకుండా అలాగే నిర్లక్ష్యము గర్వము పెరగకుండా చూసుకోవడం మంచిది. లాభ స్థానంలో శని గోచారం ఉన్నత విద్య విషయంలో వారికి అనుకున్న ఫలితాన్నిస్తుంది

పరిహారాలు


ఈ సంవత్సరం ప్రధానంగా రాహు గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి రాహు పరిహారక్రియలు చేయడం వలన మానసిక ఒత్తిడులు పని ఒత్తిడి తగ్గి ఉద్యోగంలో విద్యలో మంచి ప్రగతి సాధిస్తారు. దీనికిగాను రాహు మంత్ర జపం చేసుకోవడం కానీ లేదా రాహు స్తోత్ర పారాయణం చేయడం కానీ లేదా దుర్గా స్తోత్ర పారాయణం చేయడం కానీ మంచిది. ఒకవేళ మానసిక ఒత్తిడి కానీ పని ఒత్తిడి కానీ ఎక్కువగా ఉన్నట్లయితే దుర్గా సప్తశతి పారాయణం దానికి మంచి ఫలితాన్ని ఇస్తుంది.

No comments:

Post a Comment