Friday 5 April 2019

కన్య రాశిఫలములు వికారి నామ సంవత్సర రాశిఫలములు

Kanya rashi telugu year predictions
ఉత్తర 2,3, 4 పాదాలు (టొ, ప, పి)
హస్త 4 పాదాలు (పు, షం, ణ, ఠ)
చిత్త 1,2 పాదాలు (పె, పొ)
ఈ వికారి నామ సంవత్సరంలో కన్యా రాశి వారికి గురువు, ఏప్రిల్ 23 నుంచి నవంబర్ 5 వరకు 3వ ఇంట, వృశ్చిక రాశిలో ఆతర్వాత నవంబర్ 5 నుంచి ధనూరాశిలో, 4వ ఇంట సంచరిస్తాడు. శని జనవరి 24వ తేదీ వరకు 4వ ఇంట, ధనూరాశిలో ఆ తర్వాత 5వ ఇంట, మకర రాశిలో సంచరిస్తాడు. రాహువు సంవత్సరం అంతా మిథున రాశి లో 10వ ఇంట కేతువు 4వ ఇంటిలో ధనురాశిలో సంచరిస్తారు.

వృత్తి


ఈ సంవత్సరం కన్య రాశి వారికి కొంత సామాన్యంగా ఉంటుంది సంవత్సరమంతా గురు గోచారం మరియు జనవరి వరకు శని గోచారం అనుకూలంగా లేకపోవడం వలన శ్రమ అధికంగా చేయవలసి వస్తుంది. ఉద్యోగపరంగా ఈ సంవత్సరం కొంత సామాన్యంగా ఉంటుంది గురు గోచారం సంవత్సరమంతా an అనుకూలంగా లేకపోవడం వలన పని ఒత్తిడి ఎక్కువ అవడం దాని వలన వాయిదా వేసే స్వభావం ఏర్పడడం జరుగుతుంది. అలాగే వృత్తిలో అనుకోని మార్పులు సంభవిస్తాయి. నవంబర్ వరకు గురువు మూడవ ఇంట్లో ఉండటం వలన చేసే పనిలో శ్రద్ధ ఆసక్తి లేకపోవడం అలాగే పని కంటే ఎక్కువ ఫలితం పై దృష్టి పెట్టడం వలన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయలేక పోతారు. అలాగే శని గోచారం నాలుగవ ఇంట ఉండటం వలన మీకు ఇష్టం లేనప్పటికీ వేరే ప్రాంతంలో లో పని చేయాల్సి వస్తుంది ది. లేదా దా ఇష్టం లేని వ్యక్తులతో పని చేయాల్సి వస్తుంది. దాని కారణంగా పనిపై ఆసక్తి తగ్గుతుంది. నవంబర్ నుంచి గురువు నాలుగవ ఇంట సంచరించడం వలన శ్రమ అధికంగా చేయాల్సి వస్తుంది. అలాగే పనులు చివరి నిమిషంలో వాయిదా పడటం జరుగుతుంది. అయితే గురుదృష్టి దశమ స్థానం పై ఉండటం వలన మీరు పని పూర్తి చేసినప్పటికీ తగిన గుర్తింపు రావడం వలన ఆ శ్రమను, కష్టాన్ని మర్చిపో గలుగుతారు. అంతేకాకుండా ఇప్పుడు మీరు చేసే కష్టానికి తగిన ఫలితం పదోన్నతి రూపంలో లో అందుకుంటారు. జనవరి నుంచి శని గోచారం పంచమ స్థానంలో కొంత అనుకూలంగా ఉండటం వలన అలాగే సంవత్సరమంతా రాహు గోచారం పదవ ఇంట ఉండటం వలన ఉత్సాహంగా పని చేయగలుగుతారు. దశమ స్థానంలో రాహు గోచారం మీకు పట్టుదలను ఎలాగైనా సరే చేపట్టిన పని పూర్తి చేయాలని తెగింపును ఇస్తుంది. దానివలన ఎంతటి శ్రమకైనా ఓర్చి మీకు ఇచ్చిన పనులను పూర్తి చేయగలుగుతారు. అయితే కొన్నిసార్లు మీ తెగింపు కారణంగా ఆరోగ్య సమస్యలు కానీ మానసిక ఒత్తడి గాని గురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత ఇతరుల సహాయం కూడా తీసుకుంటూ పనులు పూర్తి చేయడం వలన అనుకూలమైన ఫలితాలు పొందుతారు. మీలో కొంతమంది సంవత్సర ద్వితీయార్ధంలో లో వృత్తిపరంగా అనుకొని మార్పులను పొందుతారు. వ్యాపారస్తులు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలను పొందుతారు. గురు గోచారం నవంబర్ వరకు కొంత అనుకూలంగా ఉండటం వలన వ్యాపారాల్లో అభివృద్ధి జరుగుతుంది. కానీ శ్రమ అధికంగా ఉంటుంది. ఏ చిన్న పని చేపట్టినా వాయిదా పడడం కానీ ఎక్కువసార్లు ప్రయత్నించాల్సి రావడం గానీ జరుగుతుంది. అయితే గురు దృష్టి సప్తమ స్థానంపై ఉండటం వలన ఆర్థికంగా వ్యాపారపరంగా అనుకూల ఫలితాలు ఉండడం వలన శ్రమను మర్చిపో గలుగుతారు. అయితే ఈ సంవత్సరం వన్ కొత్త పెట్టుబడులకు అంతగా అనుకూలం కాదు. ఒకవేళ తప్పనిసరై పెట్టాల్సి వస్తే సూర్య బలం ఉన్న నెలల్లో లో పెట్టడం మంచిది. మీ భాగస్వాముల సహాయ సహకారాలతో ద్వితీయార్ధంలో వ్యాపారం మరింత అభివృద్ధి చెందుతుంది. అయితే ఆ విషయంలో కొంత సామాన్యంగానే ఉంటుంది. కళాకారులు లేదా స్వయం ఉపాధి ద్వారా జీవనోపాధి గడిపేవారు సంవత్సరం మిశ్రమ ఫలితాలను పొందుతారు. నవంబర్ వరకు కొంత అనుకూలంగా ఉండటం వలన వారు అనుకూల ఫలితాలను పొందినప్పటికీ నవంబర్ తర్వాత గురువు అర్ధాష్టమంలో ఉండటం వలన కొంత శ్రమ పడిన తర్వాతే తగిన గుర్తింపును పొందగలుగుతారు. పంచమ స్థానంలో లో శని సంచారం కారణంగా కొన్నిసార్లు రావలసిన అవకాశాలు గుర్తింపు రాకుండా జరగవచ్చు. ఒకటి కంటే ఎక్కువ సార్లు ప్రయత్నించినచో అనుకూల ఫలితాన్ని పొందుతారు.

కుటుంబం


ఈ సంవత్సరం కుటుంబ జీవితం మిశ్రమ ఫలితాలు ఇస్తుంది. నవంబర్ వరకు కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ నవంబర్ నుంచి జనవరి మధ్యలో కుటుంబ విషయాల్లో కొంత అననుకూల వాతావరణం ఏర్పడుతుంది. కుటుంబ సభ్యుల మధ్య అవగాహన లేకుండా పోవటం కానీ లేదా మనస్పర్ధలు రావడం గానీ జరగవచ్చు. అయితే జనవరిలో లో శని మారటం వలన ఈ సమస్యలు కొంత తగ్గుముఖం పడతాయి. అలాగే చతుర్దంలో గురు కేతు గోచారం కారణంగా మీ కుటుంబ సభ్యులలో ఒకరి అనారోగ్యం మీకు మనశ్శాంతిని దూరం చేస్తుంది. జనవరి తర్వాత కొంత సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. గురు దృష్టి లాభ స్థానం పైన ఉండటం వలన మీ మిత్రుడు మరియు బంధువుల సహాయంతో సమస్యల నుంచి బయటపడగలుగుతారు. రాహువు గోచరము కొంత అనుకూలంగా ఉండటం వలన సమస్యలు వచ్చినప్పటికీ మీ పోరాట పటిమ పట్టుదల తగ్గవు దాని కారణంగా సమస్యల నుంచి సునాయాసంగా బయటపడగలుగుతారు.

ఆర్థిక స్థితి


ఈ సంవత్సరం ఆర్థికంగా మిశ్రమ ఫలితాలను పొందుతారు. నవంబర్ వరకు కు ఆర్థికంగా కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ, నవంబర్ నుంచి జనవరి మధ్యలో ఖర్చులు పెరగడం అలాగే ఆదాయం తగ్గడం వలన కొంత ఆందోళనకు గురవుతారు. అయితే సమయానికి బంధువులు లేదా మిత్రుల నుంచి ఆర్థిక సహాయం అందడం వలన ఈ సమస్య నుంచి బయటపడగలుగుతారు. ఈ సంవత్సరం పెట్టుబడుల గాని, గృహ వాహనాదుల కొనుగోలు గాని అంతగా అనుకూలించదు. అయితే తప్పనిసరి పరిస్థితులు వస్తే సూర్యుడు అనుకూలంగా ఉన్న నెలలో కొనుగోలు చేయడం మంచిది. జనవరి నుంచి శని గోచారం మిశ్రమంగా ఉండటం వలన ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి.

ఆరోగ్యం

ఈ సంవత్సరం ఆరోగ్య విషయంలో లో కొంత సామాన్యంగా ఉంటుంది. గురు శని మరియు కేతుగ్రహ గోచారం కొంత అనుకూలంగా లేకపోవడం వలన కడుపు, ఊపిరితిత్తులు, వెన్నెముక సంబంధ ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా నవంబర్ నుంచి జనవరి మధ్యలో ఆరోగ్య విషయంలో లో జాగ్రత్త అవసరం. నవంబర్ వరకు గురు గోచారం కొంత అనుకూలంగా ఉండటం వలన ఆరోగ్య సమస్యలు అంతగా బాధించదు. అలాగే జనవరి నుంచి శని గోచారం పంచమ స్థానంలో కొంత అనుకూలంగా ఉంటుంది కాబట్టి e ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి.

చదువు


విద్యార్థులకు ఈ సంవత్సరం ప్రథమార్థం అనుకూలంగా ద్వితీయార్ధం మిశ్రమంగా ఉంటుంది. గురువు దృష్టి నవంబర్ వరకు 9 మరియు పదకొండవ. స్థానం మీద ఉండటం విద్య విషయంలో కొంత అనుకూలంగా ఉంటుంది. అయితే జనవరి వరకు శని గోచారం నవంబర్ నుంచి గురు గోచారం అనుకూలంగా లేకపోవడం వలన చదువు పట్ల శ్రద్ధ తగ్గడం అలాగే కే శ్రమకు తగిన ఫలితం రాకపోవడం జరగవచ్చు. అయితే ఉత్సాహాన్ని ఏకాగ్రతను తగ్గించుకోకుండా చదువుపై దృష్టి పెడితే సరైన ఫలితాన్ని పొందుతారు.

పరిహారాలు

ఈ సంవత్సరం ప్రధానంగా గురు కేతు మరియు శని గ్రహాలకు పరిహారాలు ఆచరించడం వలన ఆరోగ్య సమస్యలు తగ్గడమే కాకుండా ఆర్థిక స్థితి కూడా కొంత మెరుగవుతుంది. దీనికిగాను గురువుకు శనికి మరియు కేతువుకు జపం చేసుకోవడం లేదా అ ఆ గ్రహాల స్తోత్ర పారాయణం చేయడం అలాగే గణపతి, ఆంజనేయ, దత్తాత్రేయ సంబంధం స్తోత్ర పారాయణం చేయడం వలన సమస్యలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి.

No comments:

Post a Comment