Friday 5 April 2019

సింహ రాశిఫలములు వికారి నామ సంవత్సర రాశిఫలములు

సింహ రాశి తెలుగు Telugu Rashiphal
మఖ 4 పాదాలు (మ, మి, ము, మే),
పుబ్బ 4 పాదాలు (మో, ట, టి, టు)
ఉత్తర 1వ పాదం (టె)
ఈ వికారి నామ సంవత్సరంలో సింహ రాశి వారికి గురువు, ఏప్రిల్ 23 నుంచి నవంబర్ 5 వరకు 4వ ఇంట, వృశ్చిక రాశిలో ఆతర్వాత నవంబర్ 5 నుంచి ధనూరాశిలో, 5వ ఇంట సంచరిస్తాడు. శని జనవరి 24వ తేదీ వరకు 5వ ఇంట, ధనూరాశిలో ఆ తర్వాత 6వ ఇంట, మకర రాశిలో సంచరిస్తాడు. రాహువు సంవత్సరం అంతా మిథున రాశి లో 11వ ఇంట కేతువు 5వ ఇంటిలో ధనురాశిలో సంచరిస్తారు.

వృత్తి

ఈ సంవత్సరం సింహ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రథమార్థం సామాన్యంగా ఉన్నప్పటికీ ద్వితీయార్ధం అనుకూల ఫలితాలను ఇస్తుంది. ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం నవంబర్ వరకు సమయం కొంత సామాన్యంగా ఉంటుంది. పని ఒత్తిడి ఎక్కువగా ఉండటం, దూర ప్రదేశాల్లో పని చేయాల్సి రావటం వలన కొంత అసౌకర్యానికి గురయ్యే అవకాశం ఉన్నది. అంతేకాకుండా ఎంత పని చేసిన రావలసిన గుర్తింపు రాకపోవడం వలన నిరుత్సాహానికి లోనయ్యే అవకాశం ఉన్నది. అయితే రాహు గోచారం అనుకూలంగా ఉండటం వలన పనులు అయినా కూడా సమయానికి పూర్తవడం అలాగే మిత్రుల నుంచి సహోద్యోగుల నుంచి సహాయ సహకారాలు అందటం వలన పని ఒత్తిడి కారణంగా కలిగే నిరాశ నిస్పృహ నుంచి బయటపడగలుగుతారు. శని మరియు కేతు గోచారం పంచమ స్థానంలో ఉండటం వలన మీ ఆలోచనలు మరియు. ప్రణాళికలు లు సరైన విధంగా ఉండక పనులను మరింత ఆలస్యం చేసే అవకాశం ఉన్నది. కాబట్టి ఇ ఆలోచనల కంటే ఎక్కువ అ పనికి ప్రాధాన్యమిస్తూ ముందుకు వెళ్లడం వలన అది మీ భవిష్యత్తుకు సహాయకారిగా ఉంటుంది. నవంబర్ నుంచి గురు గోచారం అనుకూలంగా ఉండటం వలన మీరు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. అలాగే మీ ఆలోచనలు ప్రణాళికలు అనుకున్న ఫలితాన్ని ఇస్తాయి. మీ ఉద్యోగంలో ప్రగతి సాధిస్తారు. నవంబర్ వరకు పడిన కష్టానికి ప్రతిఫలం నవంబర్ తర్వాత లభిస్తుంది. పదోన్నతి కానీ అనుకున్న ప్రదేశానికి మార్పు కాని జరిగి మీకు ఆనందాన్నిస్తుంది. జనవరిలో శని గోచారం కూడా అనుకూలంగా ఉండటం వలన అది ఉద్యోగంలో మరింత సానుకూల ఫలితాలను ఇవ్వటమే కాకుండా మీ పై అధికారుల ప్రశంసలను గుర్తింపునిస్తుంది. విదేశయాన ప్రయత్నాలు చేస్తున్నారు ఈ సంవత్సరం నవంబర్ తర్వాత అనుకూలమైన ఫలితాలను పొందుతారు. గురు దృష్టి భాగ్య స్థానం ఉండటం వలన గతంలో ఉన్న అడ్డంకులు తొలగిపోయి విదేశీ యానం విషయంలో కానీ లేదా అక్కడ స్థిరపడే విషయంలో కానీ అనుకూల ఫలితాలు లభిస్తాయి. వ్యాపారస్తులకు ఈ సంవత్సరం ప్రథమార్థం సామాన్యంగా ఉంటుంది. ఎంత కష్టపడినా సరైన లాభాలు రాక, వచ్చిన లాభాలు పెట్టుబడులకు సరిపోక కొంత సిబ్బందికి లోనుకావలసి వస్తుంది. అలాగే మీ భాగస్వాములతో సరైన సంబంధాలు లేని కారణంగా కొంత ఇబ్బందికి నష్టాలకు లోను కావలసి వస్తుంది. అయితే నవంబర్ నుంచి గురు అనుకూలంగా మారడం అలాగే జనవరిలో శని అనుకూలంగా మారడం వలన మీ సమస్యలు తొలగి పోయి వ్యాపారం అభివృద్ధి పథంలో నడుస్తోంది. పెట్టుబడులు పెట్టడానికి అలాగే వ్యాపారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి నవంబర్ తర్వాత నుంచి అనుకూల సమయం. కళాకారులు అలాగే స్వయం ఉపాధి ద్వారా జీవితాన్ని ముందుకు నడిపిస్తున్న వారికి ఈ సంవత్సరం ప్రథమార్థం కొంత వ్యతిరేకంగా ఉన్నప్పటికీ ద్వితీయార్థం అనుకూలంగా ఉండటం వలన నవంబర్ వరకు పడిన కష్టాలను నవంబర్ తర్వాత అవుతారు. వారి ప్రతిభకు గుర్తింపు రావడమే కాకుండా అవకాశాలు కూడా పెరగడంతో వారి ఆర్థిక స్థితి మెరుగు అవ్వడం అలాగే పేరు ప్రతిష్టలు పెరగడం జరుగుతుంది. జనవరి నుంచి ఉండటం అలాగే రాహు గోచారం పదకొండవ ఇంట సంవత్సరం అంతా ఉండటం వలన అనుకోని అవకాశాలు వచ్చి మీరు మరింత గుర్తింపు పేరు ప్రఖ్యాతులను పొందుతారు.

కుటుంబ జీవితం


కుటుంబ జీవితం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. నవంబర్ వరకు గురువు గోచారం అనుకూలంగా లేకపోవడం వలన ఇంటికి దూరంగా ఉండాల్సి రావడం అలాగే బంధువులతో ఆత్మీయులతో విరోధాలు పెరగడం వలన మానసిక ప్రశాంతతను ఆనందాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. అయితే రాహు గోచారం పదకొండవ ఇంట అనుకూలంగా ఉండటం వలన కొత్త మిత్రులు పరిస్థితుల కారణంగా సమస్యల నుంచి బయట పడగలుగుతారు. పంచమ స్థానంలో శని కేతు సంచారం మీ సంతానం విషయంలో కొంత ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. వారికి ఆరోగ్య సమస్యలు రావడం కానీ లేదా వారి కారణంగా ఇబ్బందులు పడాల్సి రావడం గానీ జరగవచ్చు. అయితే నవంబర్లో గురువు పంచమ స్థానానికి మారటం వలన గతంలో ఉన్న సమస్యలు తొలగిపోయి ప్రశాంతమైన జీవితాన్ని పొందుతారు. మీ బంధువులతో ఆత్మీయులతో ఉన్న వివాదాలు సమసిపోతాయి అలాగే పిల్లల ఆరోగ్యం మెరుగు పడుతుంది. నవంబర్ తర్వాత సంతానం గురించి గానీ లేదా వివాహం గురించి కానీ ఎదురుచూస్తున్న వారికి అనుకూల ఫలితాలు లభిస్తాయి. మీ సంతానం అభివృద్ధి లోకి వస్తుంది. వారి కారణంగా పడిన బాధలు తొలగిపోయి ఆనందాన్ని అనుభవిస్తారు. అలాగే అర్ధాష్టమ గురు గోచార సమయంలో మీ కుటుంబ సభ్యులు ఒకరి అనారోగ్యం మిమ్మల్ని కలవరపెడుతుంది.

ఆర్థికస్థితి


ఆర్థికంగా ఈ సంవత్సరం సామాన్యంగా ఉన్నప్పటికీ ద్వితీయార్ధం అనుకూలంగా ఉండటం వలన మిశ్రమ ఫలితాలను పొందగలుగుతారు. నవంబర్ వరకు గురు గోచారం అనుకూలంగా లేకపోవడం అలాగే శని గోచారం పంచమ స్థానంలో ఉండటం వలన ఖర్చులు అధికంగా పెరగటం అలాగే పెట్టుబడి నుంచి అనుకూలమైన ఆదాయం లేకపోవడం వలన కొంత ఇబ్బందికి గురి అయ్యే అవకాశం ఉంటుంది. అయితే రాహు పదకొండవ ఇంట ఉండటం వలన ఉండటం వలన అనుకోని విధంగా సమయానికి డబ్బు సమకూరుతుంది. దానివలన తాత్కాలికంగా అయినప్పటికీ ఆర్థిక సమస్యల నుంచి బయట పడగలుగుతారు. నవంబర్ నుంచి గురు గోచారం అలాగే జనవరి నుంచి శని అనుకూలంగా ఉండటం వలన ఆర్థికంగా అనుకూల పరిస్థితులు ప్రారంభం అవుతాయి. ఆదాయం పెరగటం అలాగే పెట్టుబడి నుంచి లాభాలు రావడం వలన కొంత డబ్బు కూడబెట్ట గలుగుతారు. ఇల్లు కాని వాహనం కానీ లేదా స్థిరాస్తులు కొనుగోలు చేద్దామనుకునే వారు జనవరి వరకు ఆగటం మంచిది. జనవరి తర్వాత గురు శని రాహు మూడు గ్రహాలు అనుకూలంగా ఉంటాయి కాబట్టి మీకు ఈ విషయాల్లో అనుకున్న ఫలితం లభిస్తుంది.

ఆరోగ్యం

ఆరోగ్య విషయంలో ఈ సంవత్సరం నవంబర్ వరకు కొంత సామాన్యంగా ఉన్నప్పటికీ నవంబర్ నుంచి గురు గోచారం అనుకూలంగా ఉండటం వలన ఆరోగ్య సమస్యలు ఆ తర్వాత పెద్దగా బాధించవు. నవంబర్ వరకు గురు నాలుగవ ఇంట సంచరించడం వలన కడుపు కాలేయం అలాగే బ్యాక్ పెయిన్ తదితర ఆరోగ్య సమస్యలతో బాధ పడే అవకాశం ఉన్నది. అలాగే శని కేతువులు పంచమ స్థానంలో సంచరించుట వలన గుండె సంబంధ సమస్యలు అలాగే ఎముకల సమస్యలు మిమ్మల్ని కొంత బాధించే అవకాశం ఉంటుంది. అయితే తే నవంబర్ లో గురువు అనుకూలం గా మారటం వలన ఆరోగ్య సమస్యల నుంచి తొందరగా బయట పడగలుగుతారు. అలాగే సంవత్సరం అంతా అనుకూలంగా ఉండటం వలన ఏ సమస్య వచ్చినా అది ఎక్కువ కాలం ఉండక తొందరగా తగ్గుముఖం పడతాయి. జనవరి నుంచి కూడా అనుకూలంగా మారడం వలన ఆరోగ్యపరంగా పూర్తిగా అనుకూలంగా ఉంటుంది. గతంలో మిమ్మల్ని బాధించిన సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు.

చదువు


విద్యార్థులకు ఈ సంవత్సరం నవంబర్ వరకు కొంత వ్యతిరేకంగా ఉన్నప్పటికీ నవంబర్ నుంచి అనుకూలంగా ఉండటం వలన చదువు విషయంలో అనుకూల ఫలితాలను పొందుతారు. నవంబర్ వరకు గురు గోచారం అనుకూలంగా లేకపోవడం వలన అలాగే పంచమ స్థానంలో శని కేతు సంచారం కారణంగా చదువు విషయంలో ఒత్తిళ్లు ఎక్కువగా ఉండటం ఆసక్తి తగ్గటం దాని కారణంగా అనుకున్న ఫలితాలు రాకపోవడం జరగవచ్చు. ఏ విషయంలోనైనా ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంతంగా ఉండి చదువుకున్నట్లు అయిన మీరు అనుకున్న ఫలితాలను పొందగలుగుతారు. నవంబర్ నుంచి గురువు జనవరి నుండి శని అనుకూలంగా మారడం వలన చదువు విషయంలో మీకు ఉన్న అడ్డంకులు తొలగిపోయి అనుకూలమైన ఫలితాలను పొందుతారు. ఉన్నత విద్యాభ్యాసం కొరకు మీరు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి.

పరిహారాలు


ఈ సంవత్సరం ప్రధానంగా నవంబర్ వరకు గురు అనుకూలంగా ఉండక పోవడం వలన పని ఒత్తిడి చెక్క ఉండటం అలాగే ఆరోగ్య సమస్యలు ఉండడం సంభవించ వచ్చు కాబట్టి ప్రధానంగా గురువుకి అలాగే శని పరిహార క్రియలు ఆచరించడం వలన ఈ సంవత్సరం మీకు అనుకూలంగా గడిచిపోతుంది. దీనికిగాను గురువుకు మరియు శనికి పూజలు జపాలు కానీ స్తోత్ర పారాయణం కానీ చేయడం మంచిది. వీటితోపాటు గురు సంబంధించిన స్తోత్ర పారాయణం లేదా గురుచరిత్ర పారాయణం చేయడం అలాగే శనికి సంబంధించి హనుమాన్ చాలీసా పారాయణం చేయడం అలాగే పేదలకు అనాధలకు సహాయం చేయడం వలన శని ప్రభావం చాలా వరకు తగ్గిపోతుంది.

No comments:

Post a Comment