Friday 5 April 2019

ధనుస్సు రాశిఫలములు వికారి నామ సంవత్సర రాశిఫలములు

Kanya rashi telugu year predictions
మూల 4 పాదములు (యె, యో, బ, బి)
పూర్వాషాఢ 4 పాదములు (బు, ధ, భ, ఢ)
ఉత్తరాషాఢ 1వ పాదం (బె)
ఈ వికారి నామ సంవత్సరంలో ధనూ రాశి వారికి గురువు, ఏప్రిల్ 23 నుంచి నవంబర్ 5 వరకు 12వ ఇంట, వృశ్చిక రాశిలో ఆతర్వాత నవంబర్ 5 నుంచి ధనూరాశిలో, 1వ ఇంట సంచరిస్తాడు. శని జనవరి 24వ తేదీ వరకు 1వ ఇంట, ధనూరాశిలో ఆ తర్వాత 2వ ఇంట, మకర రాశిలో సంచరిస్తాడు. రాహువు సంవత్సరం అంతా మిథున రాశి లో 7వ ఇంట కేతువు 1వ ఇంటిలో ధనురాశిలో సంచరిస్తారు.

ఉద్యోగం


ధను రాశి వారికి ఈ సంవత్సరం సామాన్యంగా ఉంటుంది నవంబర్ వరకు గురు గోచారం సంవత్సరమంతా శని గోచారం అనుకూలంగా ఉండక పోవడం వలన చేపట్టిన పనులలో ఆలస్యం జరగడం అడ్డంకులు ఏర్పడడం జరుగుతుంది. వృత్తిపరంగా ఈ సంవత్సరం ఎక్కువ బాధ్యతలు చేపట్టాల్సి వస్తుంది. జన్మస్థానానికి దూర ప్రాంతాల్లో పని చేయాల్సి వస్తుంది. నవంబర్ వరకు గురు గోచారం సామాన్యంగా ఉండటం వలన ఏ పని చేపట్టినా ఎక్కువ శ్రమతో పూర్తి చేయాల్సి వస్తుంది. చేసిన పనికి కూడా సరైన గుర్తింపు రాక కొంత బాధకు అసంతృప్తికి గురి కావాల్సి వస్తుంది. అయితే గురు దృష్టి శత్రు స్థానం మీద చతుర్ధ స్థానం మీద అష్టమ స్థానం మీద ఉండటం వలన కష్టపడి నప్పటికీ అనుకున్న ప్రాంతాన్ని సాధించ గలుగుతారు. మీకు ఉండే పట్టుదల మరియు దూర దృష్టి కారణంగా సమస్యల నుంచి తొందరగా బయటపడగలుగుతారు. అయితే మీ పక్కనే ఉంటూ మీకు చెడు చేయాలని చూసే వారి పట్ల కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది. నవంబర్లో గురువు జన్మస్థానానికి రావటం వలన కొంత అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. వృత్తిలో ఆటంకాలు కొంత వరకు తగ్గుతాయి. అలాగే మీ పై అధికారుల నుంచి సహకారం అందుతుంది. అయితే అదనపు బాధ్యతలు కారణంగా కొంత ఒత్తిడికి గురి కావాల్సి ఉంటుంది. శని గోచారం జనవరి వరకు జన్మస్థానంలో జనవరి నుంచి ధన స్థానంలో ఉండటం వలన ఉద్యోగ విషయంలో మార్పులు ఉంటాయి. ముఖ్యంగా జనవరి వరకు శని దృష్టి దశమ స్థానం పై ఉండటం వలన ఉద్యోగంలో అనుకోని మార్పు చోటు చేసుకుంటుంది. లేదా మీరు ఉండే ప్రదేశంలో మార్పు చోటు చేసుకొని వేరే ప్రదేశంలో ఉద్యోగం చేయాల్సి వస్తుంది. జనవరి తర్వాత శని దృష్టి చతుర్ధ స్థానం మీద అలాగే లాభ స్థానం మీద ఉండటం వలన శ్రమకు తగిన ఫలితం లభించక పోవడం ప్రతి చిన్న విషయానికి అధికంగా కష్టపడాల్సి రావడం జరుగుతుంది. అయితే ఈ సమయంలో కొత్త విషయాలు నేర్చుకోవడానికి మీ పనికి మరింత నైపుణ్యాన్ని జోడించడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో వచ్చే అవకాశాలను మీరు సరిగా వినియోగించుకోగలిగితే మీకు భవిష్యత్తులో మంచి అవకాశాలు లభించడమే కాకుండా పదోన్నతి కూడా ఇది సహాయకారిగా ఉంటుంది. ఎందుకంటే శని ఇచ్చే కష్టమైనా కూడా భవిష్యత్తుకు మీరు చేసేది గా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో మీరు పడే కష్టానికి మీరు చేసే శ్రమకు రెట్టింపు ఫలితాన్ని భవిష్యత్తులో అనుకుంటారు. వ్యాపారస్తులకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. నవంబర్ వరకు వ్యాపార పరంగా ఆదాయపరంగా కొంత సామాన్యంగా ఉన్నప్పటికీ నవంబర్లో గురువు దృష్టి సప్తమస్థానంపై ఉండటం వలన వ్యాపారం అభివృద్ధి లోకి వస్తుంది. పని ఎక్కువైనప్పటికీ ఆదాయ విషయంలో మాత్రం కొంత సామాన్యంగానే ఉంటుంది. ఈ సంవత్సరం అంతా రాహువు సప్తమ స్థానంలో సంచరించడం వలన వ్యాపారంలో ఒకసారి పూర్తిగా అనుకూలంగా ఉండటం మరోసారి పూర్తిగా వ్యతిరేకంగా ఉండటం సంభవిస్తుంది. అలాగే మీ వ్యాపారం భాగస్వాములతో కూడా కొంత ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది. కళాకారులకు అలాగే స్వయం ఉపాధి ద్వారా జీవనోపాధి కలిగి ఉన్నవారికి కూడా ఈ సంవత్సరం ప్రథమార్థం కొంత సామాన్యంగా ద్వితీయార్థం అనుకూలంగా ఉంటుంది. నవంబర్ వరకు గురు స్థితి కొంత అనుకూలంగా లేకపోవడం వలన సరైన రాకపోవడం కానీ లేదా వచ్చిన అవకాశాలు మధ్యలో ఆగిపోవడం గానీ జరుగుతుంది. ఒకటికి రెండుసార్లు ప్రయత్నించడం వలన మీరు చేపట్టిన పనులు కాని లేదా మీకు వచ్చే అవకాశాలు కానీ సరిగ్గా వినియోగించుకోగల పోతారు. నవంబర్ తర్వాత గురు దృష్టి పంచమ స్థానం పై ఉండటం వలన మీ ప్రతిభకు మంచి గుర్తింపు లభిస్తుంది. మీకు వచ్చే అవకాశాలు అన్నిటిని సరిగ వినియోగించుకోగలుగుతారు

కుటుంబం


ఈ సంవత్సరం కుటుంబ విషయంగా కొంత సామాన్యంగా ఉంటుంది. నవంబర్ వరకు గురు గోచారం అనుకూలంగా లేకపోవడం కుటుంబాల్లో కొన్ని సమస్యలు ఏర్పడటం అలాగే మధ్యన నేను అవగాహన లేకుండా ఉండటం జరగవచ్చు. లగ్న స్థానంలో శని, కేతు సంచారం సప్తమ స్థానంలో రాహు సంచారం కారణంగా భార్యాభర్తల మధ్యన అలాగే కుటుంబ సభ్యుల మధ్యన అనవసరమైన వివాదాలు కానీ అపోహలు కానీ ఏర్పడే అవకాశం ఉంటుంది. నవంబర్ తర్వాత గురు జన్మస్థానానికి రావటం వలన కొంతవరకు అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉండే అపోహలు తొలగిపోయాయి తిరిగి ఇంటిలో ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. వివాహం గురించి కానీ సంతానం గురించి కానీ ఎదురుచూస్తున్న వారికి ఈ సంవత్సరం ద్వితీయార్థంలో అనుకూల ఫలితాలు లభిస్తాయి. జనవరి నుంచి శని గోచారం రెండవ ఇంట ఉండటం వలన కుటుంబంలో పెద్ద వారి ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్త అవసరం. సప్తమ స్థానంలో సంవత్సరమంతా ఉండటం వలన మీ జీవిత భాగస్వామికి సంవత్సర ద్వితీయార్ధంలో అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉన్నది. అయితే సప్తమస్థానంపై గురు దృష్టి ఉండటం వలన ఈ సమస్యలు ఎక్కువ కాలం ఉండవు.

ఆర్థిక స్థితి


ఈ సంవత్సరం ఆర్థికంగా కొంత సామాన్యంగా ఉంటుంది. నవంబర్ వరకు గురు గోచారం పన్నెండవ ఇంట ఉండటం వలన అదుపుతప్పడం ఆదాయానికి ఖర్చులకు సంబంధం లేకుండా పోవడం జరుగుతుంది. వీలైనంతవరకు అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవడం వలన ఆర్థిక సమస్యల నుంచి దూరం కావచ్చు. నవంబర్ నుంచి గురువు జన్మస్థానంలో సంచరించడం వలన ఆర్థిక స్థితి కొంత మెరుగవుతుంది. జనవరిలో శని గోచారం ధన స్థానం లో ఉండటం వలన ఆదాయం పెరుగుతుంది అలాగే కుటుంబ విషయాల కారణంగా ఖర్చులు కూడా పెరుగుతాయి. ఆదాయం పెరగడం వలన ఈ ఖర్చులను తట్టుకోగలుగుతారు. ఈ సంవత్సరం పెట్టుబడులను కానీ, గృహ వాహనాదులు కొనుగోలుకు గాని అంతగా అనుకూలం కాదు. తప్పనిసరిగా కొనాల్సి వస్తే సూర్యుడు అనుకూలంగా ఉన్న నెలల్లో వాటిని తీసుకోవడం మంచిది. అయితే సంవత్సరం మీరు పెట్టే ఖర్చులో ఎక్కువ శాతం శుభకార్యాల కొరకు ఆధ్యాత్మిక కార్యక్రమాల కొరకు దానధర్మాల కొరకు మాత్రమే. అనవసరమైన ఖర్చులు చాలా తక్కువ మేరకు ఉంటాయి.

ఆరోగ్యం


ఈ సంవత్సరం ఆరోగ్య విషయంలో ప్రథమార్థం కొంత సామాన్యంగా ఉన్నప్పటికీ ద్వితీయార్ధం అనుకూలంగా ఉంటుంది. నవంబర్ వరకు గురువు గోచారం అనుకూలంగా లేకపోవడం వలన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా కాలేయము, ఊపిరితిత్తులు మరియు వెన్నెముక సంబంధ ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని బాధించే అవకాశం ఉన్నది. నవంబర్ నుంచి గురు గోచారం అనుకూలంగా ఉండటం వలన ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. అయితే సంవత్సరమంతా కేతువు జన్మస్థానంలో సంచరించడం వలన అనవసర భయాలకు ఆందోళనకు లోనవుతారు. లేని సమస్యలు ఉన్నట్టు ఊహించుకుని బాధ పడడం జరుగుతుంది. కాబట్టి వీలైనంతవరకూ ఆరోగ్య విషయంలో అనవసర భయాలు తావివ్వకుండా మీ పై మీరు నమ్మకాన్ని కలిగి ఉండటం మంచిది. శని గోచారం కూడా జనవరి నుంచి జనస్థానంలో సంచరిస్తాడు కాబట్టి ఆరోగ్య విషయంలో అంతగా ఇబ్బందులు ఉండవు. అయితే పని ఒత్తిడి కారణంగా మానసికంగా ఆందోళనలు మరియు వెన్ను నడుముకు సంబంధించిన అనారోగ్య సమస్యలు కొంత ఇబ్బందికి గురిచేస్తాయి.

చదువు


ఈ సంవత్సరం విద్యార్థులకు ప్రథమార్థం కొత్త సామాన్యంగా ద్వితీయార్థం అనుకూలంగా ఉంటుంది. నవంబర్ వరకు గురు దృష్టి చతుర్ధ స్థానం పై ఉండటం వలన చదువుకు అనుకూలంగా ఉన్నప్పటికీ ఏకాగ్రత లేకపోవడం అలాగే వాయిదా వేసే స్వభావం అలవాటు అవడం వలన చదువులో అనుకున్నంత ఫలితాన్ని సాధించలేకపోతారు. నవంబర్ నుంచి గురువు జన్మ స్థానం లోకి మారటం, గురు దృష్టి భాగ్య స్థానాలపై ఉండటం వలన చదువుపై తిరిగి ఆసక్తి, ఏకాగ్రత సాధ్యమవుతాయి. గురు దృష్టి భాగ్య స్థానం పై ఉండటం వలన ఉన్నత విద్యకు మంచి అవకాశాలు లభిస్తాయి. అలాగే పోటీ పరీక్షలు రాస్తున్న వారికి ఇతర పరీక్షలు రాస్తున్న వారికి నవంబర్ నుంచి సమయం అనుకూలంగా ఉంటుంది. జన్మ స్థానం లో కేతు గోచారం కారణంగా అప్పుడప్పుడు ఆందోళనకు ఆత్మన్యూనతా భావానికి లోనయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మిమ్మల్ని మీరు చదువులో కానీ ఏదైనా పనిలో కానీ నిమగ్నం చేసుకోవడం మంచిది దానివలన మీలో ఉండే వ్యతిరేకపు ఆలోచనలు దూరమయ్యి అనుకున్న ఫలితాలను సాధించగలుగుతారు.

పరిహారాలు

ఈ సంవత్సరం గురువుకు శనికి మరియు కేతువుకు పరిహారాలు ఆచరించాల్సి ఉంటుంది. నవంబర్ వరకు గురు గోచారం అనుకూలంగా ఉండక పోవడం వలన ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి గురువుకి జపం కానీ గురు స్తోత్ర పారాయణం కానీ లేదా గురు చరిత్ర పారాయణం కానీ చేయటం వలన గురు ఇచ్చే చెడు ఫలితాలు తగ్గుతాయి. అలాగే శని కి శని మంత్ర జపం కానీ శని స్తోత్ర పారాయణం చేయడం కానీ లేదా హనుమాన్ సంబంధ పారాయణం చేయడం కానీ మంచిది. కేతు గ్రహ దోష నివారణకు కేతు మంత్ర జపం లేదా కేతువు స్తోత్ర పారాయణం లేదా గణపతి స్తోత్ర పారాయణం చేయడం మంచిది. దీనివలన ఆయా గ్రహాలు ఇచ్చే చెడు ఫలితాలు తగ్గుతాయి.

No comments:

Post a Comment