Friday 5 April 2019

మిథున రాశిఫలములు వికారి నామ సంవత్సర రాశిఫలములు

MIthuna rashi, vijaya telugu year predictions
మృగశిర 3,4 పాదములు (కా,కి),
ఆరుద్ర 1,2,3,4 పాదములు(కు, ఘ, ఙ, ఛ) 
పునర్వసు 1,2,3 పాదములు (కే,కో, హా)
ఈ వికారి నామ సంవత్సరంలో మిథున రాశి వారికి గురువు, ఏప్రిల్ 23 నుంచి నవంబర్ 5 వరకు 6వ ఇంటిలో, వృశ్చిక రాశిలో ఆతర్వాత నవంబర్ 5 నుంచి ధనూరాశిలో, 7వ ఇంట సంచరిస్తాడు. శని జనవరి 24వ తేదీ వరకు 7వ ఇంట, ధనూరాశిలో ఆ తర్వాత 8వ ఇంట, మకర రాశిలో సంచరిస్తాడు. రాహువు సంవత్సరం అంతా మిథున రాశి లో 1వ ఇంట కేతువు 7వ ఇంటిలో ధనురాశిలో సంచరిస్తారు.

వృత్తి


మిధున రాశి వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. ఆరు, ఏడు ఇళ్లలో గురు గోచారం అనుకూలంగా ఉండటం అలాగే శని గోచారం ఏడు మరియు ఎనిమిదవ ఇంట గోచారం కారణంగా ప్రథమార్థం వృత్తి పరంగా, కుటుంబ పరంగా అనుకూలంగా ఉంటుంది. ద్వితీయార్థంలో కొన్ని అనుకోని మార్పులు జరిగే అవకాశం ఉంటుంది. ఉద్యోగస్థులకు ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది గురు దృష్టి నవంబర్ వరకు ధన స్థానం పై అలాగే దశమ స్థానం పై ఉండటం వలన వృత్తిలో అభివృద్ధి అలాగే ఆర్థికంగా అభివృద్ధి మరియు గుర్తింపు లభిస్తాయి. నవంబర్ నుంచి సప్తమ స్థానంలో గోచారం కారణంగా వృత్తి లో మార్పులు అలాగే విదేశీ యానం లేదా ఉద్యోగం చేస్తున్న ప్రదేశంలో మార్పు ఉంటాయి. ఈ మార్పు అనుకూల ఫలితాలను ఇస్తుంది. అయితే ఈ సంవత్సరం అంతా రాహు లగ్న స్థానంలో అంటే మిథున రాశిలో గోచారం కారణంగా మీపై అపవాదులు కానీ నిందలు కానీ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మీ ప్రవర్తన విషయంలో కూడా కొంత జాగ్రత్త అవసరం. జన్మస్థానం లో రాహు అహంకారాన్ని మాట వినని స్వభావాన్ని పెంచుతారు దాని కారణంగా మీ సహోద్యోగులతో వివాదాలు పెరగటం అలాగే మీ అబ్బాయి అధికారుల దృష్టిలో మీరు అహంకారం కలవారు మాట వినని వారు గా మిగిలి పోతారు దాని కారణంగా జనవరి తర్వాత వృత్తిలో లో అనుకోని మార్పులు జరగడం కానీ లేదా పని ఒత్తిడి పెరగడం కాని జరగవచ్చు. అంతేకాకుండా మీకు రావలసిన పదోన్నతి కానీ మంచి మార్పు కానీ వాయిదా పడే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా జన్మ స్థానంలో రాహువు పోరాడే స్వభావాన్ని విజయం కొరకు ఏదైనా చేసే తెగింపును ఇస్తాడు. దాని కారణంగా మీరు విజయం కొరకు తప్పుడు మార్గాన్ని పెంచుకునే అవకాశం ఉంది కాబట్టి విజయంతో పాటుగా మంచి పేరు ప్రజల గుర్తింపు కొరకు పాటు పడటం మంచిది. తాత్కాలిక విజయం కొరకు మీరు చేసే ప్రయత్నాలు భవిష్యత్తులో మీకు అనవసరమైన సమస్యలను సృష్టించవచ్చు కాబట్టి ఇ ఓపికగా ఏకాగ్రతతో పని చేసినట్లైతే మీరు అనుకున్న విజయాన్ని సాధించ గలుగుతారు. జనవరి తర్వాత శని గోచారం అష్టమ స్థానంలో సంచరించడం కారణంగా మీకు రావలసిన పేరును విజయాన్ని రాకుండా చేయడానికి కొంతమంది ప్రయత్నించే అవకాశం ఉంది కాబట్టి ఇతరుల విషయంలో కొంత జాగ్రత్త అవసరం. అందరితోనూ సామరస్య పూర్వకంగా ప్రేమపూర్వకంగా మెలగటం వలన చాలా సమస్యలు దూరం చేసుకోగలుగుతారు. వ్యాపారస్తులకు ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. గురు గోచారం కారణంగా వ్యాపారం అభివృద్ధి అలాగే ఆర్థిక స్థితి మెరుగు పడటం జరుగుతుంది. ఈ సంవత్సరం మీరు అనుకున్న విజయాన్ని సాధించగలుగుతారు. అలాగే మీరు చేస్తున్న వ్యాపారం లో కొత్తగా భాగస్వాములు చేరడం కానీ లేదా కొత్త బ్రాంచ్ ఓపెన్ చేయడం కానీ జరుగుతుంది. రాహు గోచారం చంద్రునిపై సంచరించడం కారణంగా వ్యాపారంలో కొన్నిసార్లు మంచి అభివృద్ధి మరి కొన్నిసార్లు సామాన్య స్థితి ఉంటుంది. అలాగే మానసికంగా కూడా ఒత్తిడి అధికంగా ఉంటుంది. కళాకారులు స్వయం ఉపాధి రంగంలో ఉన్నవారు ఈ సంవత్సరం మంచి అభివృద్ధిని పొందుతారు. మీరు చేస్తున్న ప్రయత్నాలు విజయవంతమై మీకు మంచి పేరును గుర్తింపును ఇస్తాయి ముఖ్యంగా నవంబర్ నుంచి గురువు గోచారం సప్తమ స్థానంలో అనుకూలంగా ఉండటం వలన మీ కళకు, విద్యకు గుర్తింపు లభిస్తుంది. అయితే జనవరి తర్వాత శని దృష్టి దశమ స్థానం పై ఉండటం వలన మీకు రావలసిన పేరు ప్రతిష్టలను వేరే వారు తీసుకెళ్లడం కానీ లేక అడ్డుపడం గాని జరగవచ్చు. ఇతరులను సులువుగా నమ్మక మీ జాగ్రత్తలో మీరు ఉండటం మంచిది.

కుటుంబం


ఈ సంవత్సరం మీకు కుటుంబ జీవితం అనుకూలంగా ఉంటుంది. నవంబర్ వరకు గురు దృష్టి కుటుంబ స్థానంపై ఉండటం నవంబర్ తర్వాత గురు దృష్టి జన్మస్థానం పై ఉండటం వలన కుటుంబంలో లో అనుకూలం ఫలితాలు ఏర్పడతాయి. వివాహం గురించి కానీ సంతానం గురించి ఎదురు చూసే వారికి ఈ సంవత్సరం నవంబర్ తర్వాత అనుకూలత లభిస్తుంది. అలాగే కుటుంబంలో శుభకార్యాలు జరగడం, కుటుంబ సభ్యుల మధ్య ప్రేమాభిమానాలు పెరగడం జరుగుతుంది. అయితే రాహువు గోచరము కొంత సామాన్యం గా ఉండటం వలన అనవసర వివాదాలు అలాగే మీ గురించి చెడుగా మాట్లాడటం లేదా పుకార్లు రావటం జరగవచ్చు. జనవరి వరకు శని గోచారం సప్తమ స్థానంలో లో ఆ తర్వాత అష్టమ స్థానంలో సంచరించడం వలన మీకు మరియు మీ జీవిత భాగస్వామికి మధ్య కొన్ని మనస్పర్థలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అయితే గురు గోచారం అనుకూలంగా ఉండటం వలన ఈ సమస్యలు పెద్దవి కాకుండా తొందరగానే సమసిపోతాయి. సప్తమ స్థానంలో లో కేతువు గోచారము కారణంగా మీ జీవిత భాగస్వామికి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.

ఆర్థిక స్థితి


ఆర్థిక స్థితి విషయానికొస్తే ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. గురు గోచారం బాగుండటం వలన మీ ఆర్థిక స్థితి మెరుగు పడుతుంది. అలాగే గతంలో చేసిన అప్పులు కానీ, లోన్లు కానీ సమయానికి తీర్చుకోగలుగుతారు. పెట్టుబడుల కారణంగా కూడా మంచి ఆదాయం లభిస్తుంది. సంవత్సర ద్వితీయార్ధంలో ఇల్లు కానీ వాహనం కానీ కొనుగోలు చేస్తారు. పెట్టుబడుల విషయంలో ప్రథమార్థం కన్నా ద్వితీయార్థం ఎక్కువగా అనుకూలిస్తుంది. అయితే జనవరి తర్వాత శని దృష్టి ధన స్థానం పై పడటం వలన అనుకోని ఖర్చులు కానీ ఆర్ధిక నష్టం కానీ సంభవించే అవకాశం ఉంది. పెట్టుబడుల విషయంలో కొంత జాగ్రత్తగా ఆలోచించి పెట్టడం మంచిది. అలాగే జన్మస్థానంలో రాహు సంచారం కారణంగా కొన్నిసార్లు గొప్పలకు పోయి అనవసరంగా డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉన్నది.

ఆరోగ్యం


ఆరోగ్య విషయంలో ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. నవంబర్ నుంచి చి జన్మస్థానం పై ఉండటం వలన గతంలో ఉన్న ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. అలాగే జనవరి తర్వాత శని అష్టమ స్థానంలో సంచరించుట, రాహు జన్మస్థానంలో సంచరించడం వలన మెడ, కడుపు, ఎముకలు, ఊపిరితిత్తులు మరియు పాదాలకు సంబంధించిన అనారోగ్యాలలో వలన బాధ పడే అవకాశం ఉంటుంది అయితే నవంబర్ నుంచి గురు గోచారం అనుకూలంగా ఉండటం వలన ఆరోగ్య సమస్యలు ఎక్కువ కాలం ఉండకుండా తొందరగా తగ్గుతాయి. ఆహార విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోవడం అలాగే అలవాట్ల విషయంలో జాగ్రత్తగా ఉండటం వలన చాలా వరకు ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి.

చదువు


విద్యార్థులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. విద్యా కారకుడైన గురువు గోచారం అనుకూలంగా ఉండటం వలన చదువులో లో మంచి ఉన్నతిని సాధిస్తారు. అనుకున్న ఫలితాన్ని పొందుతారు. అయితే శని రాహువులు జనవరి వరకు సమ సప్తకాలుగా ఉండటం వలన కొంత బద్ధకము మొండితనము అలాగే అవకాశం ఉంది అలాగే విజయం కొరకు తప్పుడు విధానాలు అవలంబించే అవకాశం కూడా ఉంది. నిజాయితీగా మరియు బద్ధకం లేకుండా చదివిన యెడల మంచి విజయాన్ని సాధించగలుగుతారు. సప్తమ స్థానంలో గురువు గోచారం ఉన్నత విద్య అవకాశాలను మెరుగుపరుస్తుంది. అలాగే విదేశాల్లో చదవడానికి కూడా అవకాశాలను కల్పిస్తుంది.

పరిహారాలు


ఈ సంవత్సరం మీకు రాహు, శని మరియు కేతు గోచారం అనుకూలంగా లేకపోవడం వలన కొన్ని సమస్యలను ఎదుర్కునే అవకాశం ఉంటుంది. ఆ సమస్యల ప్రభావం తగ్గడానికి అనుకూల ఫలితాలను పొందడానికి శనికి రాహువుకు మరియు కేతువుకు పరిహార క్రియలు ఆచరించడం మంచిది. దీనికి గాను శని జపం రాహు జపం మరియు కేతు జపం చేయటం లేదా ఈ గ్రహాల స్తోత్ర పారాయణం చేయడం లేదా ఆంజనేయ దుర్గా మరియు గణేశ సంబంధ స్తోత్ర పారాయణం చేయడం మంచిది

No comments:

Post a Comment