Friday 5 April 2019

వృశ్చిక రాశిఫలములు వికారి నామ సంవత్సర రాశిఫలములు

Kanya rashi telugu year predictions
విశాఖ 4వ పాదం(తో)
అనురాధ 4 పాదాలు (న, ని,ను, నే)
జ్యేష్ట 4 పాదాలు (నో, య, యి, యు)
ఈ వికారి నామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి గురువు, ఏప్రిల్ 23 నుంచి నవంబర్ 5 వరకు 1వ ఇంట, వృశ్చిక రాశిలో ఆతర్వాత నవంబర్ 5 నుంచి ధనూరాశిలో, 2వ ఇంట సంచరిస్తాడు. శని జనవరి 24వ తేదీ వరకు 2వ ఇంట, ధనూరాశిలో ఆ తర్వాత 3వ ఇంట, మకర రాశిలో సంచరిస్తాడు. రాహువు సంవత్సరం అంతా మిథున రాశి లో 8వ ఇంట కేతువు 2వ ఇంటిలో ధనురాశిలో సంచరిస్తారు.

వృత్తి


వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ప్రథమార్ధం కొంత సామాన్యంగా ద్వితీయార్థం అనుకూలంగా ఉంటుంది. మీకు గురు గోచారం అనుకూలంగా ఉండటం వలన ప్రథమార్థంలో గురు గోచారం కొంత సామాన్యంగా ఉండటం వలన వృత్తిలో ఎక్కువ బాధ్యతలు ఉండటం అలాగే పదోన్నతి వచ్చినప్పటికీ బాధ్యతల కారణంగా దానిని సరిగా అనుభవించక పోవటం అలాగే జన్మస్థానానికి దూర ప్రాంతంలో పనిచేయాల్సి రావడం మొదలైన ఫలితాలుంటాయి. అలాగే శని గోచారం రెండవ ఇంట జనవరి వరకు కొంత సామాన్యంగా ఉండటం వలన మీరు చేసే పనికి సరైన గుర్తింపు రాక ఇబ్బంది పడాల్సి ఉంటుంది. మీరు ఎంత కష్టపడినా అప్పటికి మీ పై అధికారుల నుంచి రేపు గాని ప్రశంస గాని రాకపోవడం వలన కొంత అసహనానికి అసంతృప్తికి లోనవుతారు. మీ సహోద్యోగుల నుంచి సహకారం కూడా కొంత తక్కువగా ఉంటుంది. ఈ సంవత్సరం అంతా రాహు గోచారం అష్టమ స్థానంలో ఉండటం వలన కొన్నిసార్లు మానసిక ఒత్తిడికి గురి కావాల్సి వస్తుంది. అలాగే మీరు చేస్తున్న పనులకు కానీ వృత్తిలో కాని అనవసరమైన అడ్డంకులను ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు ఎంత నిజాయితీగా పని చేసినప్పటికీ రహస్య శత్రువుల కారణంగా మీ పై అధికారుల నుంచి సరైన ఆకారం అందకపోవటం జరగవచ్చు. వీలైనంతవరకు ఎవరినీ గుడ్డిగా నమ్మక మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళటం వలన చాలా సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. నవంబర్ నుంచి గురువు జనవరి నుంచి శని అనుకూలంగా వృత్తిలో అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. పదోన్నతి లభించడమే కాకుండా మీ ప్రతిభకు గుర్తింపు ప్రశంసలు లభిస్తాయి. మీ రహస్య శక్తుల నుంచి పడిన బాధలు ముగియడమే కాకుండా ఆర్థికంగా కూడా మంచి స్థితిని పొందుతారు. ఈ సంవత్సరం తో ఏలినాటి శని పూర్తి అవుతుంది కాబట్టి శని ఇచ్చే మంచి ఫలితాలను కూడా పొందుతారు. అయితే అష్టమ స్థానంలో ఉన్న రాహువు గోచరము అలాగే రెండవ స్థానంలో సంచరించే కేతువు గోచారము విషయంలో కొంత జాగ్రత్త అవసరం. మీ మాట తీరు కారణంగా లేదా మీ పై ఉండే ఈర్ష కారణంగా మీకు చెడు చేయటానికి కొంతమంది చూసే అవకాశం ఉంటుంది అటువంటి వారి విషయంలో కొంత జాగ్రత్త అవసరం. వ్యాపారస్తులకు ఈ సంవత్సరం బాగా కలిసి వస్తుంది. గురు గోచారం అనుకూలంగా ఉండటం అలాగే జనవరి నుంచి శని గోచారం కూడా అనుకూలంగా మారటంతో వ్యాపారంలో అభివృద్ధి సాధిస్తారు. పెట్టిన పెట్టుబడులకు రెట్టింపు లాభాలను గడిస్తారు. ఈ సంవత్సరం నవంబర్ నుంచి గురువు ధన స్థానం లో సంచరించుట వలన కొద్ది కాలంగా ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. భాగస్వామ్య వ్యాపారం లో కూడా మంచి ఫలితాలు సాధిస్తారు. కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి అలాగే కొత్త ప్రదేశాల్లో వ్యాపారం ప్రారంభించడానికి నవంబర్ నుంచి అనుకూల సమయం. కళాకారులు కానీ స్వయం ఉపాధి ద్వారా ఉపాధి పొందుతున్న వారు కానీ ఈ సంవత్సరం అనుకూల ఫలితాలను పొందుతారు. నవంబర్ వరకు గురు దృష్టి పంచమ స్థానం పై ఉండటం వలన మీ కళకు గుర్తింపు లభిస్తుంది. కొత్త విషయాలు నేర్చుకోగలుగుతారు అలాగే కొత్త పరిచయాల కారణంగా మరింత అభివృద్ధి సాధిస్తారు. అయితే అష్టమ స్థానంలో రాహు సంచారం కారణంగా మీ పక్కనే ఉండి మీకు గోతులు తీసే వారి విషయంలో కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది. ఈ సంవత్సరం మీకు ప్రతిభకు గుర్తింపు లభించి ప్రభుత్వ సత్కారం కానీ పురస్కారం కానీ అందుకుంటారు.

కుటుంబం


ఈ సంవత్సరం కుటుంబ విషయాలకు చాలా అనుకూలంగా ఉంటుంది. గురు గోచారం లగ్న ధన స్థానాల్లో అనుకూలంగా ఉండటం వలన మీ కుటుంబంలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. మీ పెద్దవారి నుంచి ఆశీస్సులు అందుకోవడమే కాకుండా ఇతర కుటుంబ సభ్యుల నుంచి కూడా సహాయక సహకారాలను అందుకుంటారు. గురు గోచారం నవంబర్ నుంచి అనుకూలంగా ఉండటం వలన సంతానం గురించి కానీ లేదా వివాహంగురించి కానీ ఎదురుచూస్తున్న వారికి అనుకూలమైన ఫలితం లభిస్తుంది. అయితే అష్టమ స్థానంలో రాహువు గోచరము కారణంగా కొంత మంది కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు ఏర్పడటం కాని వారి ఈర్ష అసూయ ల కారణంగా మీ మనసు నొచ్చుకోవటం కానీ జరుగుతుంది. అలాగే కేతు గోచారం కుటుంబ స్థానంలో ఉండటం వలన ఇంట్లో పెద్ద వారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. మీ కుటుంబంలో మీ మాటకు విలువ పెరగడమే కాకుండా ముఖ్యమైన బాధ్యతలను కూడా మీకు అప్పగిస్తారు. మీ పిల్లల కారణంగా మీకు పేరు ప్రతిష్టలు పెరగడం జరుగుతుంది. జనవరి తర్వాత మీ సోదరులకు అనుకోని శుభ సంఘటన జరగటం కానీ విజయం కానీ లభిస్తుంది.

ఆర్థిక స్థితి

ఈ సంవత్సరం ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉంటుంది. గడచిన సంవత్సరంలో ఖర్చు అధికంగా అవటం అలాగే బాధ్యతలు పెరగడం వలన డబ్బుకు కొంత ఇబ్బంది పడి ఉండవచ్చు. కానీ ఈ సంవత్సరం ఆదాయం పెరగటం వలన ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. సంవత్సరం అంతా రాహు గోచారం అంతగా అనుకూలంగా లేకపోవడం వలన కొన్ని అనవసరమైన ఖర్చులు కూడా మీపై పడే అవకాశం ఉంటుంది. సరైన ఆలోచన లేకుండా తొందరపాటుతనంతో ఖర్చు చేయడం వలన సంవత్సరారంభంలో ఆర్థికంగా కొంత ఇబ్బంది పడినప్పటికీ, ఆ తర్వాత ఆ సమస్య దూరమవుతుంది. పదోన్నతి కారణంగా ఆర్థికంగా కూడా అభివృద్ధి సాధ్యమవుతుంది. ఇల్లు కాని వాహనం కానీ కొనుగోలు చేయాలనుకునే వారు నవంబర్ తర్వాత కానీ జనవరి తర్వాత కానీ తీసుకోవడం మంచిది. అలాగే పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి కూడా నవంబర్ తర్వాత అనుకూలించే సమయం. కేతు గోచారం ధన స్థానంలో ఉండటం వలన ఒక్కోసారి అనుకోని డబ్బు రావడం కానీ అలాగే మరోసారి అనుకోని ఖర్చులు మీద పడడం గాని జరుగుతుంది.

ఆరోగ్యం


ఈ సంవత్సరం ఆరోగ్య విషయంలో అనుకూలంగా ఉంటుంది. గురు గోచారం ఒకటి రెండవ ఇండ్లలో అనుకూలంగా ఉండటం అలాగే ఏల్నాటి శని కూడా పూర్తవడం వలన ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా గతంలో ఉన్న ఆరోగ్య సమస్యలు కూడా అవుతాయి. అయితే అష్టమ స్థానంలో రాహు గోచారం కారణంగా మెడ, కడుపుకు సంబంధించిన అనారోగ్య సమస్యలు అలాగే మానసిక ఆరోగ్య సమస్యలు అప్పుడప్పుడు మిమ్మల్ని బాధించవచ్చు. సరైన ఆహారం తీసుకోవడం అలాగే శారీరక వ్యాయామాలు చేయడం వలన చాలా వరకు ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి. ఈ సమస్యలు ముఖ్యంగా నవంబర్ వరకు అధికంగా ఉంటాయి ఆ తర్వాత తగ్గుముఖం పడతాయి.

చదువు


ఈ సంవత్సరం విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంటుంది. గురు గోచారం సంవత్సరం అంతా అనుకూలంగా ఉండటం వలన చదువులో బాగా రాణిస్తారు. పరీక్షలలో అనుకున్నదానికంటే ఎక్కువ మార్కులు సాధించి నలుగురిలో మంచి పేరును గుర్తింపును పొందుతారు. నవంబర్ వరకు గురు దృష్టి పంచమ స్థానం పై ఉండటం వలన చదువుపై ఆసక్తి కాకుండా కొత్త విషయాలు నేర్చుకోవాలని కూడా ఎక్కువ అవుతుంది. అలాగే నవంబర్ నుంచి గురు గోచారం అనుకూలంగా ఉండటం వలన చదువులో మంచి అభివృద్ధి సాధిస్తారు. అయితే అష్టమ స్థానంలో రాహు గోచారం అలాగే రెండవ ఇంట కేతు గోచారం కారణంగా కొన్నిసార్లు ఏకాగ్రత కోల్పోవడం అలాగే చదువుపై ఆసక్తి తగ్గడం జరుగుతుంది. మానసికంగా ఒత్తిడి ఎక్కువైనప్పుడు కొంతకాలం విశ్రాంతి తీసుకోవడం లేదా ఇతర విషయాలపై దృష్టి నిలపడం వలన చదువుపై ఆసక్తి తిరిగి ప్రారంభం అవుతుంది. ఉన్నత విద్య కొరకు కానీ విదేశాల్లో చదువుకు కానీ ఎదురుచూస్తున్న వారికి ఈ సంవత్సరం అనుకూల ఫలితం ఉంటుంది. వారి కోరిక నెరవేరడానికి కాకుండా మంచి విద్యాసంస్థల్లో ప్రవేశం లభిస్తుంది.

పరిహారాలు

ఈ సంవత్సరం ప్రధానంగా రాహు కేతువులకు పరిహారాలు చేయడం మంచిది. అష్టమ స్థానంలో రాహువు ధన స్థానంలో కేతువు కారణంగా కొన్నిసార్లు ఆరోగ్య సమస్యలు మానసిక సమస్యలకు ఆర్థిక సమస్యలకు గురి కావలసి వస్తుంది. వీటి నుంచి బాధపడడానికి రాహు కేతు కు పరిహారాలు చేయటం రాహు కేతు జపం చేయటం వాటికి పూజ చేయటం అలాగే రాహు కేతు సంబంధ స్తోత్ర పారాయణం చేయడం లేదా దుర్గా మరియు గణపతి సంబంధించిన కానీ పూజ కానీ చేయడం వలన రాహు కేతులు ఇచ్చే చెడు ఫలితాల ప్రభావం చాలా వరకు తగ్గుతుంది

No comments:

Post a Comment