Friday 5 April 2019

కుంభ రాశిఫలములు వికారి నామ సంవత్సర రాశిఫలములు

Kanya rashi telugu year predictions
ధనిష్టా 3, 4 పాదాలు (గు, గె)
శతభిషం 4 పాదాలు (గొ, స, సి, సు)
పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు (సె, సో, ద)
ఈ వికారి నామ సంవత్సరంలో మకర రాశి వారికి గురువు, ఏప్రిల్ 23 నుంచి నవంబర్ 5 వరకు 10వ ఇంట, వృశ్చిక రాశిలో ఆ తర్వాత నవంబర్ 5 నుంచి ధనూరాశిలో, 11వ ఇంట సంచరిస్తాడు. శని జనవరి 24వ తేదీ వరకు 11వ ఇంట, ధనూరాశిలో ఆ తర్వాత 12వ ఇంట, మకర రాశిలో సంచరిస్తాడు. రాహువు సంవత్సరం అంతా మిథున రాశి లో 5వ ఇంట కేతువు 11వ ఇంటిలో ధనురాశిలో సంచరిస్తారు.

వృత్తి


ఈ వికారి నామ సంవత్సరం కుంభ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. గురువు 10 మరియు 11 వ ఇంట సంచరించడం అలాగే జనవరి వరకు శని లాభస్థానంలో సంచరించడం వలన అన్ని విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం కలిసి వస్తుంది. వారు చేపట్టిన కార్యక్రమాలు అలాగే బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించడం వల్ల పై అధికారుల మన్ననలు పొంది ఉద్యోగంలో పదోన్నతి పొందటం కానీ అనుకున్న చోటుకు బదిలీ అవటం కానీ జరుగుతుంది. గతంలో ఉన్న సమస్యలు తొలగి పోయి మీ కార్యాలయంలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. గతంలో మీకు చెడు చేయాలని అనుకున్న వారు కానీ రహస్య శత్రువులు కానీ ఈ సంవత్సరం దూరం అవ్వటం వలన కొంత మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. మీ మాటకు విలువ పెరగడమే కాకుండా మీకు అధికారం కూడా వస్తుంది. అయితే కొన్నిసార్లు కొంత అహంకారానికి కానీ అసంతృప్తి కానీ లోనయ్యి మీ సహోద్యోగులతో కానీ పై అధికారులతో కానీ గొడవ పడే అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంతవరకు మీ పని పై మాత్రమే దృష్టి పెట్టినట్టయితే మీకు ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. నవంబర్ వరకు గురు పదవ ఇంట ఉండటం వలన కొంత పని ఒత్తిడి ఉన్నప్పటికీ పనులు సులువుగా పూర్తవుతాయి. మీ సహోద్యోగులు మరియు పై అధికారుల సహాయ సహకారాలు అందుకుంటారు. నవంబర్ నుంచి గురువు పదకొండవ ఇంత సంచరించడం వలన మీరు అనుకున్న విధంగా ఉద్యోగంలో మార్పులు జరుగుతాయి. మీరు విదేశీయానం కొరకు అని లేదా విదేశాల్లో స్థిరపడటం కొరకు చేసే ప్రయత్నాలు ఈ సంవత్సరం సఫలీకృతం అవుతాయి. అయితే జనవరి నుంచి మీకు ఏలినాటి శని ప్రారంభమవుతుంది కాబట్టి వృత్తి విషయంలో కొంత జాగ్రత్త అవసరం. శని దృష్టి ఆరవ ఇంటిపై మరియు భాగ్య స్థానం పై ఉండటం వలన ఉద్యోగంలో అనుకోని మార్పులు కానీ లేదా ప్రదేశంలో మార్పులు కానీ సంభవించవచ్చు. వ్యాపారస్తులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. గురు గోచారం అనుకూలంగా ఉండటం వలన వ్యాపారంలో మంచి ప్రగతి సాధిస్తారు. మీరు అనుకున్న విధంగా మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోగలుగుతారు. అంతేకాకుండా కొత్త వ్యాపార భాగస్వాములు రావడం కానీ లేదా కొత్త ప్రదేశాల్లో వ్యాపారం ప్రారంభించడం కానీ చేస్తారు. దీనివలన వ్యాపార అభివృద్ధి తో పాటు మీ ఆర్థిక స్థితి కూడా మెరుగుపడుతుంది. నవంబర్ తర్వాత గురువు లాభ స్థానంలో సంచరించడం వలన వ్యాపారంలో అనుకున్న ఫలితాలను లాభాలను పొందుతారు. మీరు పెట్టిన పెట్టుబడులకు రెట్టింపు లాభాలు రావడం జరుగుతుంది. జనవరి తర్వాత శని పన్నెండవ ఇంటికి రావడం వలన కొంత వ్యతిరేక ఫలితాలు ఉండవచ్చు. వచ్చే లాభాల్లో కొంత శాతం తగ్గడం కానీ లేదా పెట్టుబడులు పెరగడం గానీ జరుగుతుంది. అయితే గురు బలం బాగా ఉండటం వలన ఈ సమస్యలు మిమ్మల్ని పెద్దగా బాధించవు. కళాకారులు మరియు స్వయం ఉపాధి ద్వారా ఉపాధి కలిగినవారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. గురు గోచారం మరియు జనవరి వరకు శని గోచారం అనుకూలంగా ఉండటం వలన మీ రంగాల్లో బాగా రాణించగలుగుతారు. అలాగే మీ ప్రతిభకు గుర్తింపు లభించి మరిన్ని అవకాశాలను పొందుతారు. అయితే పంచమ స్థానంలో రాహు సంచారం కారణంగా మీలో కొంత అహంకారం కానీ మీ వృత్తి పట్ల అతి నమ్మకం కానీ పెరిగి దానివలన మీకు అవకాశాలు ఇచ్చే వారి పట్ల చిన్న చూపు కలిగేలా చేస్తుంది. కాబట్టి వీలైనంత వరకు మిమ్మల్ని మీరు సరిదిద్దుకొని ముందడుగు వేసినచో ఈ సంవత్సరం చాలా అనుకూలమైన ఫలితాలు పొందుతారు.

కుటుంబం


ఈ సంవత్సరం మీకు మీ కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు పెరగడమే కాకుండా వారి నుంచి సహాయ సహకారాలు కూడా అందుతాయి. సంవత్సర ద్వితీయార్ధంలో మీ మిత్రుల కారణంగా ఒక ముఖ్యమైన పని సాధించగలుగుతారు. శని గోచారం కూడా జనవరి వరకు అనుకూలంగా ఉండటం వలన మీ కుటుంబంలో శుభకార్యాలు జరగడం అలాగే మీ కుటుంబ సభ్యులతో కలిసి పుణ్య క్షేత్ర సందర్శన చేయటం చేస్తారు. నవంబర్ నుంచి పంచమ స్థానం పై అలాగే సప్తమస్థానంపై గురు దృష్టి ఉండటం వలన మీ సంతానం అలాగే మీ జీవిత భాగస్వామి మంచి అభివృద్ధిలోకి వస్తారు. వారి కారణంగా మీకు సమాజంలో పేరు ప్రతిష్టలు కలుగుతాయి. వివాహం గురించి కానీ సంతానం గురించి కానీ ఎదురుచూస్తున్న వారికి ఈ సంవత్సరం ద్వితీయార్ధంలో అనుకున్న ఫలితం లభిస్తుంది. అయితే పంచమంలో రాహు స్థితి కారణంగా మీ సంతానంలో ఒకరికి నవంబర్ లోపు ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే గురుబలం అనుకూలంగా ఉండటం వలన ఈ సమస్యలు పెద్దగా బాధించవు. అలాగే మీ సోదరులు కూడా ఈ సంవత్సరం మంచి అభివృద్ధిలోకి వస్తారు. సంవత్సర ద్వితీయార్ధంలో మీ జీవిత భాగస్వామికి మంచి ఉద్యోగం రావడం కానీ లేదా వారు అనుకున్న ఒక ముఖ్యమైన పని పూర్తి కావడం కానీ జరుగుతుంది. జనవరి నుంచి శని గోచారం కొంత అనుకూలంగా ఉండదు కాబట్టి కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. అయితే సంవత్సరమంతా లాభ స్థానంలో సంచారం ఉంటుంది కాబట్టి ఈ సమస్యలేవైనా ఎక్కువ కాలం ఉండవు.

ఆర్థిక స్థితి


ఈ సంవత్సరం కుంభ రాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా జనవరి వరకు గురు గోచారం అలాగే శని గోచారం అనుకూలంగా ఉండటం వలన ఆర్థికంగా చాలా అనుకూలిస్తుంది. ఉద్యోగంలో పదోన్నతి తో పాటు ఆర్థికంగా కూడా అభివృద్ధి జరగడం అలాగే గతంలో పెట్టిన పెట్టుబడుల గురించి మంచి లాభాలు ఆర్జించడం జరుగుతుంది. దీనివలన మీ ఆర్ధిక సమస్యలు తొలగిపోయి ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారు. ఈ సంవత్సరం నవంబర్ వరకు గురు గోచారం పదవ ఇంట ఉండటం వలన ఆదాయం విషయంలో అనుకున్నంత మార్పు ఉండదు కానీ నవంబర్లో గురు మారాక ఆదాయంలో అనుకూలమైన మార్పులు చోటుచేసుకుంటాయి. ఇల్లు కాని వాహనం కానీ కొనుగోలు చేయాలనుకునే వారు నవంబర్ జనవరి మధ్యలో చేయటం చాలా అనుకూలం. ఆ సమయంలో గురువు మరియు శని ఇద్దరూ లాభ స్థానం లో ఉంటారు కాబట్టి మీరు కొనాలనుకున్న వి అనుకున్న ధరకు కొనుగోలు చేయగల్గుతారు. వ్యాపారస్తులు కళాకారులు ఇతరులు కూడా ఆర్థికంగా ఈ సంవత్సరం నిలదొక్కుకుంటారు.

ఆరోగ్యం


ఈ సంవత్సరం మీ ఆరోగ్యం ప్రథమార్థం చాలా అనుకూలంగా ఉంటుంది. గతంలో ఉన్న ఆరోగ్య సమస్యలు తొలగిపోవడమే కాకుండా మీ శారీరక స్థితి కూడా మెరుగుపడుతుంది. నవంబర్ వరకు గురు పదవ ఇంట్లో ఉండటం, జనవరి వరకు శని లాభ స్థానంలో ఉండటం వలన ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని పెద్దగా బాధించవు. అయితే జనవరిలో శని పన్నెండవ ఇంట మారటం వలన కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. శని కారణంగా ఎముకలకు సంబంధించిన సమస్యలు, నొప్పులు, పాదాలకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా బాధిస్తాయి. అయితే నవంబర్ నుంచి గురు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ ఆరోగ్య సమస్యలు ఎక్కువ కాలము మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు. పంచమంలో రాహువు గోచరము కారణముగా గ్యాస్ట్రిక్ సంబంధ సమస్యలు గుండె మంట మొదలైనవి ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఇది చాలావరకు మీరు ఆహార విషయంలో సరైన నియమాలు పాటించకపోవడం వలన వచ్చే సమస్య తప్ప మరొకటి కాదు. కాబట్టి ఈ సంవత్సరం కొద్ది జాగ్రత్తలతో మీ ఆరోగ్యాన్ని కాపాడుకున్నట్లు అయితే పెద్దగా లేకుండా గడిచి పోతుంది.

చదువు


విద్యార్థులకు ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా విద్యా కారకులైన గురువు గోచారం అనుకూలంగా ఉండటం వలన చదువులో బాగా రాణిస్తారు. పరీక్షల్లో మంచి మార్పులు రావడమే కాకుండా సమాజంలో మంచి గుర్తింపు రావటం వలన మీ తల్లిదండ్రులకు ఆనందాన్ని కలిగిస్తారు. గురువు దృష్టి ఈ సంవత్సరం నాలుగైదు స్థానాలపై ఉండటం వలన చదువు మీద ఆసక్తి పెరగడం అలాగే మీ సృజనాత్మకత పెరగడం వలన విద్యా విషయాలలో మీరు ఆదర్శంగా నిలుస్తారు. నవంబర్లో శని పదకొండు ఇంటికి రావడం వలన అనుకున్న విద్యాలయాల్లో ప్రదేశం పొందడం అలాగే చదువు విషయంగా మీ కోరిక నెరవేరడం జరుగుతుంది. పోటీ పరీక్షలు పరీక్షలు రాసే వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది మీరు రాసే పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధించి ఉద్యోగాన్ని పొందుతారు. జనవరి తర్వాత శని గోచారం పన్నెండవ ఇంట ఉండటం వలన బద్ధకం అలసత్వము అలాగే చదువు పట్ల కొంత నిర్లక్ష్యం ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి గర్వానికి బద్ధకానికి తావివ్వకుండా ఉన్నట్లయితే మంచి భవిష్యత్తును కలిగి ఉంటారు.

పరిహారాలు


ఈ సంవత్సరం జనవరి తర్వాత మీకు ఏల్నాటి శని ప్రారంభమవుతుంది కాబట్టి శనికి పరిహారాలు చేసుకోవడం మంచిది దీనివలన ఏల్నాటి శని కాలం లో ఎటువంటి సమస్యలు లేకుండా మంచి అభివృద్ధి సాధించ గలుగుతారు. దీనికిగాను శనికి మంత్ర జపం చేయటం కానీ శని స్తోత్ర పారాయణం చేయడం కానీ లేదా హనుమాన్ స్తోత్ర పారాయణం చేయడం కానీ మంచిది. వీటితో పాటుగా అన్నదానం చేయటం అలాగే శారీరకంగా శ్రమ కలిగే విధంగా సాయం చేయడం వలన శని ప్రభావం చాలా వరకు తగ్గుతుంది తద్వారా మీకు ఆరోగ్యమే కాకుండా మంచి జీవితం లభిస్తుంది.

No comments:

Post a Comment