Friday 6 April 2018

మిథున రాశిఫలములు

మిథున రాశిఫలములు

విలంబి(విలంబ)నామ సంవత్సర రాశిఫలములు

గమనిక: ఇక్కడ ఇవ్వబడిన రాశి ఫలములు కేవలం చంద్ర రాశి ఆధారంగా చెప్పబడినవి. ఇవి కేవలం ఒక అవగాహన కొరకే తప్ప ఇందులో చెప్పినవి చెప్పినట్టు జరుగుతాయని భావించరాదు.

MIthuna rashi, vijaya telugu year predictions
మృగశిర 3,4 పాదములు (కా,కి),
ఆరుద్ర 1,2,3,4 పాదములు(కు, ఘ, ఙ, ఛ) 
పునర్వసు 1,2,3 పాదములు (కే,కో, హా)
ఈ సంవత్సరం గురువు పంచమ స్థానమైన తుల రాశి లో అక్టోబర్ వరకు అనుకూలంగా ఉంటాడు ఆ తర్వాత ఆరవ ఇంట, వృశ్చిక రాశిలో మధ్యమ ఫలితాలను ఇస్తాడు. శని సప్తమ స్థానమైన ధను రాశిలో ఈ సంవత్సరమంతా సంచరిస్తాడు. రాహువు రెండవ ఇంట కర్కాటక రాశిలో, కేతువు ఎనిమిదవ ఇంట మకర రాశిలో సంవత్సరమంతా సంచరిస్తారు.

ఈ విలంబి నామ సంవత్సరం ఎలా ఉండబోతోంది.

మిథున రాశి వారికీ ఈ విలంబి నామ సంవత్సరం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో అనుకోని మార్పులు చోటు చేసుకుంటాయి. ఆర్థికంగా మిశ్రమంగా ఉంటుంది. సంపాదన పెరిగినప్పటికీ అనుకోని ఖర్చుల కారణంగా కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు, సంబంధ బాంధవ్యాలు కొంత మెరుగవుతాయి. వ్యక్తిగతంగా జ్ఞానాభివృద్ది జరగటం, కొత్త విషయాలు నేర్చుకోవటం జరుగుతుంది.

ఆరోగ్యం

ఈ సంవత్సరం గురు గోచారం అక్టోబర్ వరకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఆరోగ్యం విషయంలో మంచి ఫలితాలు ఉంటాయి. ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్న వారు వాటి నుంచి తొందరగా బయట పడతారు. ఆరోగ్యం మెరుగవుతుంది. అయితే కేతు గోచారం అష్టమ స్థానంలో సంచరించటం కారణంగా మానసిక సమస్యలకు, ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంటుంది. లేని పోనీ విషయాల కారణంగా జరగనివి ఊహించుకొని బాధపడటం, ఆత్మన్యూనత కు లోనవటం జరుగుతుంది. ఈ సమయంలో వచ్చే భయలేవి నిజంకావు అని గుర్తించాలి అలాగే లేని సమస్యలను, రోగాలను ఉన్నట్టు ఊహించుకొని బాధపడటం తగ్గించుకోవాలి. దాని వలన మానసిక ఒత్తిడి నుంచి భయట పడగలుగుతారు. అలాగే సప్తమ స్థానంలో శని సంచారం కారణంగా గుప్త వ్యాధుల భారిన పడే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండటం మంచిది.

ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక స్థితి

ఈ సంవత్సరం ఉద్యోగస్థులకు కొంత బాగున్నప్పటికీ అనుకోని మార్పుల కారణంగా కొంత ఇబ్బందికి గురయ్యే అవకాశముంటుంది. అక్టోబర్ వరకు గురు గోచారం అనుకూలంగా ఉండటం వలన ఉద్యోగంలో అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. మీ మాట నెగ్గటం, మీ పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తవటం జరుగుతుంది. ప్రమోషన్ కొరకు ఎదురు చూస్తున్న వారికీ అక్టోబర్ లోపు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉన్నది. అక్టోబర్ తర్వాత పరిస్థితుల్లో మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. మీ స్వయంకృతాపరాధం వాళ్ళ కావచ్చు లేక మీ నోటి దురుసుతనం వాళ్ళ కావచ్చు మీ పై అధికారుల కోపానికి కారణం అవుతారు. దాని వలన అనుకోని విధంగా మార్పులు చోటు చేసుకుంటాయి. మీరు ఉన్న ప్రదేశం నుంచి వేరే ప్రదేశానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. కొన్ని రోజులు మీకు నచ్చని ప్రదేశంలో లేదా నచ్చని వ్యక్తులతో కలిసి ఉద్యోగం చేయాల్సి వస్తుంది. అలాగే శని దృష్టి కారణంగా మీకు బద్ధకం, వాయిదా వేసే గుణం పెరుగుతుంది. ఇది కూడా ఒకరకంగా మీ వృత్తిలో మార్పుకు కారణం అవుతుంది.
వ్యాపారస్తులకు ఈ సంవత్సరం అక్టోబర్ వరకు అనుకూలంగా ఉంటుంది. గురు గోచారం అనుకూలంగా ఉండటం వలన పెట్టుబడుల నుంచి మంచి లాభాలు వస్తాయి. వ్యాపారం కూడా అభివృద్ధి చెందుతుంది. అయితే అక్టోబర్ తర్వాత అనవసరమైన పెట్టుబడుల కారణంగా ఆర్థికంగా కొంత ఇబ్బంది కరమైన పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అలాగే వ్యాపారం కూడా కొంత మందకొడిగా సాగుతుంది. కొత్తగా వ్యాపారం ప్రారంభం చేయాలనుకునే వారు అక్టోబర్ లోపు ప్రారంభం చేసుకోవటం మంచిది.
ఆర్థికంగా ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. ఆదాయం బాగున్నప్పటికి, గొప్పలకు పోయి ఎక్కువ ఖర్చులు చేయటం, అనవసరమైన వాటి కొరకు పెట్టుబడులు పెట్టడం కారణంగా కొంత ఇబ్బంది కరమైన పరిస్థితులు ఎదురవొచ్చు. వచ్చిన ఆదాయాన్ని సరైన విధంగా ఖర్చు చేయగలిగితే చాల వరకు ఆర్థిక సమస్యలు దరిచేరవు.

కుటుంబం

గురు గోచారం అక్టోబర్ వరకు పంచమ స్థానంలో అనుకూలంగా ఉండటం వలన ఈ సంవత్సరం సంతానార్థులకు సంతానం కలిగే అవకాశం బలంగా ఉన్నది. మీ మిత్రుల, బంధువుల సహాయ, సహకారాలు అందుకుంటారు. వారి కారణంగా మీకు సంబంధించిన ఒక ముఖ్యమైన పని పూర్తవుతుంది. మీ కుటుంబ జీవితం కూడా ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. అక్టోబర్ వరకు అన్నివిధాలుగా అనుకూలంగా ఉంటుంది. అక్టోబర్ తర్వాత గురు గోచారం మారటం, శని సప్తమంలో సంచారం అలాగే కుటుంబ స్థానంలో రాహు సంచారం కారణంగా అక్టోబర్ తర్వాత కుటుంబ సభ్యులకు దూరంగా ఉండాల్సి వస్తుంది. వృత్తిలో అనుకోని బదిలీ లేదా ఇతర కారణాల వలన కొంతకాలం కుటుంబానికి దూరంగా ఉండాల్సి వస్తుంది. శని గోచారం కారణంగా భార్య, భర్తల మధ్యన మనస్పర్థలు అపోహలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా రెండవ ఇంట రాహు గోచారం మీకు మాటమీద అదుపు లేకుండా చేస్తుంది. దాని కారణంగా మీ జీవిత భాగస్వామి కానీ, ఇతర కుటుంబ సభ్యులు కానీ బాధపడే అవకాశం ఉంటుంది.

చదువు

విద్యార్థులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. గురు గోచారం పంచమ స్థానంలో సంచారం కారణంగా చదువు పట్ల శ్రద్ధ పెరగటం, కొత్త విషయాలు నేర్చుకోవాలి అనే ఆసక్తి పెరగటం జరుగుతుంది. అలాగే చదువులో బాగా రాణిస్తారు. అనుకున్న ఫలితాన్ని పొందుతారు. అయితే రాహు గోచారం అనుకూలంగా లేనందువలన కొన్ని సార్లు చదువు పట్ల అహంభావం, అశ్రద్ధ ఎక్కువ అవుతాయి. దాని ప్రభావం పరీక్ష ఫలితాలపై పడుతుంది కాబట్టి ఓపిక మరియు ఆసక్తి పెంచుకోవటం మంచిది.

చేయాల్సిన పరిహారాలు



ఈ సంవత్సరం శని, కేతు మరియు రాహు గ్రహాలకు పరిహారాలు చేయటం మంచది. దీని వలన అలసత్వం, ఆవేశం తగ్గటమే కాకుండా అన్ని విధాలుగా అభివృద్ధి జరుగుతుంది. శని, రాహు మరియు కేతువుల మంత్రం జపం జానీ, స్తోత్రాలు కానీ ప్రతి రోజు చదవటం మంచిది. లేదా ప్రతి రోజు దుర్గ, గణేశ, హనుమాన్ సంబంధ స్తోత్రం ఏదైనా చదవటం మంచిది.

No comments:

Post a Comment